BREAKING
రూ.1.35 లక్షలకు వినాయకుడి లడ్డును సొంతం చేసుకున్న జగదీష్ గౌడ్ దేవరయాంజాల్‌లో ఘనంగా నిమజ్జనం మెడికల్ మాఫియా పై నియంత్రణ లేదా? రోడ్డుపై చేరిన నీరు, నాటు వేస్తూ నిరసన తెలిపిన మహిళలు అనాధల సేవకులు నరసన్న కు మాచాని పరామర్శ అడ్వకేట్ నెరమెట్ల ఎల్లన్నకు ఘన సత్కారం పంతంగిలో జడ్పీ సీఈవో శోభారాణి పర్యటన భారీ వర్షానికి జలమయమైన కనగర్తి పాఠశాల డిపాజిట్లు పై దుమారం అర్జెంటీనాలో పెరిగిన పేదరికం బాలీవుడ్ బాక్సాఫీస్ ట్రెండ్ మార్పు.. మళ్లీ హారర్ కామెడీ, థ్రిల్లర్ సినిమాల జోరు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే సునీత స్కూల్ బస్సు ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకోవాలి అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి:ఏవో మాధవి లత విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా బరిలో ఫాదర్ సెంటిమెంట్ మూవీ

రాజంపేట లో జనసేన జోరు,,చేరికల హోరు

Select Suryaa Now
రాజంపేట లో జనసేన జోరు,,చేరికల హోరు

యల్లటూరు శ్రీనివాసరాజు  నాయకత్వంపై విశ్వాసంతో జనసేనలో చేరిన నారపరెడ్డిపల్లి నాయకులు, మహిళలు, యువత

రాజంపేట,మేజర్ న్యూస్;రాజంపేట లో యల్లటూరి ఆధ్వర్యం లో జనసేన జోరుతో రోజు రోజుకి చేరికల హోరు పెరుగుతుంది. గురువారం రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని నారపరెడ్డిపల్లి గ్రామంలో జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి.నారపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొంగాణి రఘు యాదవ్  ఆధ్వర్యంలో ఆయన అనుచరులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు.రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు నాయకత్వంపై, ఆయన అభివృద్ధి దృక్పథంపై, భవిష్యత్తుపై ఆయనకు ఉన్న ముందుచూపుపై సంపూర్ణ విశ్వాసంతో 150 కి పైగా కుటుంబాలు పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా రఘు యాాదవ్ కి మరియు 150 కుటుంబాల ప్రజలకు, ఆయన అనుచరులకు జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేన కుటుంబంలో మమేకమయ్యారు.నారపరెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు.ఈ చేరికలతో నారపరెడ్డిపల్లిలో జనసేన పార్టీకి మరింత బలం చేకూరిందని పార్టీ శ్రేణులు తెలిపారు.