BREAKING
ఐరాస వేదికగా భారత్ ఆరోగ్య విప్లవం అమెరికా సెనెట్‌లో యుద్ధ అధికారాల తీర్మానం జాతీయ వచ్చిందా రక్తదాన దినోత్సవం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అసోం పారిశ్రామికీకరణకు మానవ వనరులే అసలైన బలం: ఆర్థిక మంత్రి జయంత మల్ల బారువా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి : రాజ్ థాకరే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది... జాగ్రత్త ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్: ఆదివారం కూడా తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి!

భారీ వర్షానికి జలమయమైన కనగర్తి పాఠశాల

Select Suryaa Now
భారీ వర్షానికి జలమయమైన కనగర్తి పాఠశాల

భారీ వర్షానికి జలమయమైన కనగర్తి పాఠశాల

-ఆవరణలో చెరువును తలపిస్తున్న వర్షపు నీరు.. 
విద్యార్థులకు తప్పని తిప్పలు  

రాజన్న సిరిసిల్ల /సూర్య కోనరావుపేట:

బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోనరావుపేట మండలం కనగర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణ జలమయమైంది. పాఠశాల ప్రాంగణంలో పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతో చెరువును తలపించింది. దీంతో గురువారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిలో నడుచుకుంటూ తరగతి గదులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు పేర్కొన్నారు. వర్షం పడిన ప్రతిసారీ ఇదే సమస్య పునరావృతమవుతోందని, నీరు బయటకు వెళ్లేలా సరైన డ్రైనేజీ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.
అధికారులు స్పందించి పాఠశాల ఆవరణను పరిశీలించి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.