ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24) : మారుతున్న పర్యావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్‌గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ అప్పారావు నాయుడు, స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరి అన్నారు. గురువారం ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల గ్రామంలో కొండాపూర్ విజ్ఞాన్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల, స్ఫూర్తి ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్ కామినేని ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చన్నారు. ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను పంపిణీ చేశారు. అనంతరం కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు బృందాలుగా ఏర్పడి గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బొడ్డు వినోద నాగార్జున, మాజీ ఉపసర్పంచులు కందుల రాజు, బొడ్డు నాగార్జున, మాజీ వార్డు సభ్యుడు దయ్యాల అంజనేయులు, స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు మేకల పద్మారావు, ప్రధాన కార్యదర్శి కంది సత్యనారాయణ, సభ్యులు పరుశరాం, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ అధికారి శ్రీలత, కామినేని ఆసుపత్రి మార్కెటింగ్ అధికారి బాలకృష్ణ, వైద్యులు సుధ (గైనకాలజిస్ట్), మోక్షిత (ఆర్థోపెడిక్), సమంత (జనరల్ ఫిజిషియన్), కార్తిక్, నాయకులు తరిణే మహేంద్రచారి, మాటూరి రవి, నర్సింహా, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు చంద్రశేఖర్, రమ్య, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ లంబ రాజు