BREAKING
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? నన్ను ఎంతైనా అవమానించండి.. ప్రజలు మాత్రం ఇప్పుడైనా మేల్కొండి: యాంకర్ రష్మి గౌతమ్! రైతు కూలీల సమస్యలపై ఐక్య పోరాటం యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది?

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు

Select Suryaa Now
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు
బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య
సంగారెడ్డి, : జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు ప్రభుత్వం అందించే పరిహారం సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య జిల్లా అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి పోలీసు, రెవెన్యూ, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి
సమావేశంలో భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, రోస్టర్ పాయింట్ల అమలు, బ్యాక్‌లాగ్ ఖాళీలు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా బక్కి వెంకయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అన్నారు.
119 పెండింగ్ కేసులకు ₹1.82 కోట్ల పరిహారం అవసరం
జిల్లాలో 2026 జనవరి నుంచి ఆగస్టు 31 వరకు 109 మంది అట్రాసిటీ కేసుల బాధితులకు ₹1.70 కోట్ల పరిహారం అందించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వీరిలో 88 మంది ఎస్సీలు, 21 మంది ఎస్టీలు ఉన్నట్లు వివరించారు.
అదేవిధంగా మరో 119 పెండింగ్ అట్రాసిటీ కేసులకు పరిహారం చెల్లించేందుకు ₹1.82 కోట్ల నిధులు అవసరమని, ఆ నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ తెలిపారు.
దర్యాప్తులో జాప్యం ఉండకూడదు
అట్రాసిటీ కేసుల దర్యాప్తు, విచారణలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ సూచించారు. కేసుల పరిష్కారంపై కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
సిద్దిపేటలో సంచార న్యాయస్థానం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది సత్యనారాయణకు సూచించారు.
బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయాలి
అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, బ్యాక్‌లాగ్ ఖాళీల వివరాలను చైర్మన్ శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. బ్యాక్‌లాగ్ ఖాళీలను త్వరితగతిన భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఔట్‌సోర్సింగ్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి కోటా మేరకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.
ఉప ప్రణాళిక నిధులు పక్కదారి పట్టకూడదు
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలని, ఇతర అవసరాలకు మళ్లించరాదని చైర్మన్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు జాప్యం లేదా నిర్లక్ష్యం వహించడాన్ని సహించేది లేదని అన్నారు.
విద్యార్థుల సౌకర్యాలపై ఆరా
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, యూనిఫాములు, పుస్తకాలు, మౌలిక వసతులు, ఉపకార వేతనాలు, వసతి గృహాల మరమ్మతులు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎస్సీ, ఎస్టీ రైతులకు అందుతున్న రైతు భరోసా, రైతు బీమా, పారిశుద్ధ్య కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలపై కూడా ఆరా తీశారు.
భూ సమస్యలను పరిష్కరించాలి
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. శాశ్వత అంగన్‌వాడీ భవనాలు లేని కేంద్రాలకు స్థలాలను గుర్తించి, భవనాల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ భూ సేకరణలో అసైన్డ్ భూములు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా పరిధిలో పరిష్కరించగలిగిన సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని, కమిషన్ చైర్మన్ సూచనలు, సలహాలను అమలు చేస్తామని చెప్పారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను కమిషన్ చైర్మన్‌కు వివరించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత సమయంలోపు చార్జిషీట్లు దాఖలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల నుంచి వినతుల స్వీకరణ
సమీక్ష సమావేశం అనంతరం ఎస్సీ, ఎస్టీల నుంచి వివిధ సమస్యలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు నాయక్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.