BREAKING
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? నన్ను ఎంతైనా అవమానించండి.. ప్రజలు మాత్రం ఇప్పుడైనా మేల్కొండి: యాంకర్ రష్మి గౌతమ్! రైతు కూలీల సమస్యలపై ఐక్య పోరాటం యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది?

మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ

Select Suryaa Now
మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ

 

రూ.5.70 కోట్లకు పైగా నిధులు మంజూరు.. త్వరలో పనులు ప్రారంభం

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మన్నె శంకర్ యాదవ్

మోమిన్‌పేట్,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24):
మోమిన్‌పేట్ మండలంలోని మారుమూల గ్రామాల రహదారులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నె శంకర్ యాదవ్ తెలిపారు. గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు పలు బీటీ రోడ్ల నిర్మాణానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.
గురువారం మోమిన్‌పేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చక్రంపల్లి, బాల్రెడ్డిగూడ, సయ్యద్ అలీపూర్, పల్లెగుట్ట తండా, బూరుగుపల్లి, వెల్చాల్ నుంచి మల్లారెడ్డిగూడ వరకు పలు రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు.

నిధుల వివరాలు ఇలా..

- చక్రంపల్లి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గ్రామం వరకు కిలోమీటర్ మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు.
- బాల్రెడ్డిగూడకు మెయిన్ రోడ్డు నుంచి గ్రామం వరకు 2 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.1.60 కోట్లు.
- పల్లెగుట్ట తండా నుంచి సయ్యద్ అలీపూర్ గ్రామం వరకు రహదారి నిర్మాణానికి రూ.1.20 కోట్లు.
- బూరుగుపల్లి బస్టాండ్ నుంచి గ్రామం వరకు 60 మీటర్ల రహదారి నిర్మాణానికి రూ.40 లక్షలు.
- వెల్చాల్ నుంచి మల్లారెడ్డిగూడ గ్రామం వరకు 2.80 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

ఈ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని మన్నె శంకర్ యాదవ్ తెలిపారు. మారుమూల గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. రహదారుల నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తొలగడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.రిపోర్టర్ మాణిక్య చారి