పకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం…
అధిక వర్షాలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి అధికారులు సన్నద్ధంగా ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు మేరకు అమలాపురం తాసిల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు గ్రామ రెవెన్యూ అధికారులు తోగురువారం సమావేశం జరిగింది తాసిల్దార్ విఎస్ దివాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు, తాలూకా సబ్ ఇన్స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు మరియు ప్రస్తుత అధిక వర్షాలు భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లయితే తీసుకొనవలసిన చర్యల సన్నద్ధతపై చర్చించినారు.