మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు
మార్కెట్ ఆదాయం, భూముల వివరాలు, అభివృద్ధి పనులపై సమీక్ష
కీసర,మేజర్ న్యూస్ ,(సెప్టెంబర్ 24):
మేడ్చల్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు (ఎఫ్ ఏ సి), హైదరాబాద్ రాహుల్ రాజ్ (ఐ ఏ ఎస్) గురువారం మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఎఎంసి)ని సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యకలాపాలు, ఆదాయ పరిస్థితులు, భవిష్యత్ అభివృద్ధి అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఆదాయ తగ్గుదలపై ప్రధానంగా చర్చ
మార్కెట్ ఫీ ద్వారా లభిస్తున్న ఆదాయం, గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడానికి గల కారణాలను అధికారులు వివరించారు. మార్కెట్ ఆదాయాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు అధికారులు తెలిపారు.
భూముల లభ్యతపై వివరాల సేకరణ
ఏ ఎం సి పరిధిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూముల వివరాలతో పాటు ప్రాంతాల వారీగా భూముల లభ్యత, వాటి వినియోగానికి సంబంధించిన అంశాలను సంచాలకులు సమీక్షించారు.
అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై సమీక్ష…
మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన వివిధ అభివృద్ధి పనులపై అధికారులు వివరాలు సమర్పించారు. మార్కెట్ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్ జె డి ఎం హైదరాబాద్ ఇ. మల్లేశం, ఆర్ డి డి హైదరాబాద్ పి. ప్రసాద్ రావు, ఏ ఎం సి మేడ్చల్ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, వైస్ చైర్మన్ విఠల్ నాయక్, సభ్యులు బత్తుల వేణు, డి ఎం ఓ. మేడ్చల్ రియాజ్, ఏ ఎం సి మేడ్చల్ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ కర్రె గణేష్