అత్తాపూర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి
- వేములవాడ బార్ అసోసియేషన్
సూర్య, వేములవాడ:
విధుల్లో భాగంగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన న్యాయవాదుల మొబైల్ ఫోన్లు తీసుకుని దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్–2025 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఘటనలపై తెలంగాణ డీజీపీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.