పల్లె పండుగకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం
పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం
ఫోటో. అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
నియోజకవర్గంలోని గ్రామాలను మరింత సుందరంగా, మౌలిక వసతులతో తీర్చిదిద్దేందుకు ప్రతిష్టాత్మకమైన పల్లె పండుగ 3.0 కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం చుట్టారు.ఇందులో భాగంగా గురువారం స్థానిక మున్సిపల్ ఆఫీసులో నియోజకవర్గంలోని అన్ని మండలాల పంచాయతీరాజ్ ఈ ఈ , ఏఈలతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు.నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 18 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగింది.నిధులు మంజూరైన వెంటనే పనులను ప్రారంభించి, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు.