BREAKING
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? నన్ను ఎంతైనా అవమానించండి.. ప్రజలు మాత్రం ఇప్పుడైనా మేల్కొండి: యాంకర్ రష్మి గౌతమ్! రైతు కూలీల సమస్యలపై ఐక్య పోరాటం యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది?

అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి కమిషనర్ రాహుల్ మీనా

Select Suryaa Now
అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి కమిషనర్ రాహుల్ మీనా

అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి: కమిషనర్ రాహుల్ మీనా* 

రాజమహేంద్రవరం మేజర్ న్యూస్

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు రాజమహేంద్రవరం మరోమారు వేదిక కానుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో అక్టోబర్ 8 , 9  తేదీల్లో నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం నందు ఈ వారోత్సవాలు జరగనున్నాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ సంయుక్త సహకారంతో ఇస్రో ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఇస్రో సివిల్ డివిజన్ హెడ్ వి.లక్ష్మణ సతీష్, సీనియర్ శాస్త్రవేత్త కె.అశ్విని గురువారం కమిషనర్ రాహుల్ మీనా ను ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ.. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇస్రో చేపట్టిన ప్రయోగాల రాకెట్ నమూనాలు ఈ వారోత్సవాల్లో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అలాగే ఆరవ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, స్పాట్ క్విజ్, స్పాట్ ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా సూచించారు. అనంతరం టీజర్ ను ఆవిష్కరించారు.