BREAKING
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు లింగ వివక్షతను ఆపండి ఆడపిల్లను కాపాడండి నినాదంతో పోటీలు వేలాడే విద్యుత్ తీగలతో ప్రమాదం గాలి వానకు రోడ్డుపై విరిగిపడిన చెట్టు రోగ్ ఏఐ ముప్పు వెనుక ఉన్న అసలు కారణాలు పులివెందుల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఏం సుభాన్ సిగ్మా మూవీలో డిఫరెంట్ రోల్ చేశా.. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా ఇంటర్వ్యూ విశేషాలు మేకవనంపల్లి పీఏసీఎస్‌ను మరింత బలోపేతం చేస్తా ఆసియా క్రీడల్లో భారత బాక్సింగ్‌కు నిరాశ ఐఐఎం కాశీపూర్ డెహ్రాడూన్ క్యాంపస్‌కు శంకుస్థాపన పకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం గుజరాత్‌లో బి.ఆర్. అంబేద్కర్ మ్యూజియం ప్రారంభం ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబుకు ఊహించని ప్రశ్న.. నెటిజన్ల ఆగ్రహం ఆసియా క్రీడల్లో భారత్ హాకీ హ్యాట్రిక్ విజయం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు

Select Suryaa Now
ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు

 

ఎన్యూమరేషన్ నోటీసుల జారీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి

అధికారులకు ఎన్నికల అబ్జర్వర్ ఇళంబర్తి ఆదేశం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24):ఓటర్ల మ్యాపింగ్, ఎన్యూమరేషన్ నోటీసుల జారీ ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని ఓటర్ల జాబితా సవరణ అబ్జర్వర్ ఇళంబర్తి అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాలుగు నియోజకవర్గాల పరిధిలో చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్, ఎన్యూమరేషన్ నోటీసుల జారీ ప్రక్రియ పురోగతిని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులతో కలిసి సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు పూర్తయిన మ్యాపింగ్, ఓటర్ల సంఖ్య, జారీ చేసిన ఎన్యూమరేషన్ నోటీసులు, పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి, సరైన విధంగా మ్యాపింగ్ చేయాలని సూచించారు. అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ నోటీసులను నిర్ణీత విధానంలో అందజేయడంతో పాటు, నోటీసుల జారీకి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. సందేహాలు, అభ్యంతరాలు లేదా సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
*ఎస్ఐఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి పరిశీలన...
అనంతరం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అలంపల్లి ప్రాంతంలో పీఎస్ నంబర్లు 169, 170, అలాగే మోతీనగర్ కాలనీలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో పీఎస్ నంబర్లు 150, 151, 152 పరిధిలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను అబ్జర్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి ఓటర్ల జాబితాకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.2022 ఓటర్ల జాబితాలో తమ పేర్లు స్పష్టంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియలో పేర్లు కనిపించడం లేదని రాజకీయ పార్టీల ప్రతినిధులు అబ్జర్వర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే వయస్సు, పుట్టిన తేదీ తదితర వివరాలకు సంబంధించి సమస్యలు ఉన్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన అబ్జర్వర్ సమస్యలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అవసరమైన పత్రాలను సేకరించి సమర్పించాలని సూచించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని నిబంధనల మేరకు పరిశీలించి, అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో సక్రమంగా ఉండేలా చూడాలన్నారు.ఓటర్ల మ్యాపింగ్, ఎన్యూమరేషన్ నోటీసుల జారీ ప్రక్రియలో అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఇళంబర్తి సూచించారు.ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటూరు, డీఆర్వో స్వర్ణలత, ఆర్డీఓ వాసుచంద్ర, తాండూరు ఆర్డీఓ అనిత, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎన్నికల విభాగం అధికారి నెమత్ హాలీ, బూత్ స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.