భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: భగత్ సింగ్ జయంతి సందర్భంగా గురువారం మెగా రక్తదాన శిబిరం పోస్టర్స్ ను డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ కు ప్రొద్దుటూరు పట్టణంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్త నిధి కేంద్రం నందు నందు 28వ తేదీ సోమవారం ఉదయం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, పొద్దుటూరు పట్టణంలో యువత ముందుకు వచ్చి భగత్ సింగ్ జయంతి మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ మధ్యకాలంలో చాలామందికి గర్భిణీ స్త్రీలకు రక్తం చాలా తక్కువ ఉండడం వలన రక్త కొరత ఏర్పడింది కాబట్టి విద్యార్థులు ,ప్రజలు ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తం ఇవ్వచ్చు అని అన్నారు. ఈ భగత్ సింగ్ రక్తదాన పోస్టర్స్ విడుదలలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల అధ్యక్షులు పాలజీ శేఖర్ కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజ్, సుమన్, జాషువా, శేఖర్, ఆరీఫ్. తదితరులు పాల్గొన్నారు.