BREAKING
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? నన్ను ఎంతైనా అవమానించండి.. ప్రజలు మాత్రం ఇప్పుడైనా మేల్కొండి: యాంకర్ రష్మి గౌతమ్! రైతు కూలీల సమస్యలపై ఐక్య పోరాటం యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది?

ఐరాస వేదికగా భారత్ ఆరోగ్య విప్లవం

Select Suryaa Now
ఐరాస వేదికగా భారత్ ఆరోగ్య విప్లవం

1.8 లక్షల ఆరోగ్య మందిరాలు, 90 కోట్ల డిజిటల్ ఐడీలు
సూర్య జాతీయ డెస్క్: న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 81వ సాధారణ మహాసభ (UNGA81) ప్రాంగణంలో భారత్ తన వైద్యారోగ్య రరంగ విప్లవాత్మక పురోగతిని ప్రపంచ వేదికపై సగర్వంగా చాటిచెప్పింది. సార్వత్రిక ఆరోగ్య రక్షణ మరియు ప్రపంచ ఆరోగ్యంపై నిర్వహించిన 7వ వార్షిక మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1.8 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. మాతా శిశు సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ, మానసిక ఆరోగ్యం మరియు వృద్ధుల సంరక్షణ సేవలు సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన తీరును అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లారు.

ఆరోగ్య రక్షణ రంగంలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ భారత్ డిజిటల్ హెల్త్ వ్యవస్థను వేగంగా విస్తరిస్తోంది. డిజిటల్ మిషన్ ద్వారా ఇప్పటికే 90 కోట్లకు పైగా పౌరులకు విశిష్ట ఆరోగ్య గుర్తింపు కార్డులు (ABHA) కేటాయించినట్లు తెలిపారు. ఈ సంకేతిక అనుసంధానం ద్వారా రోగుల వైద్య రికార్డులు భద్రపరచడం మరియు వైద్య సేవల్లో నిరంతరాయ పారదర్శకత సాధ్యమవుతోంది. ఈ సంస్కరణలతో పాటు ఈ-సంజీవని వేదిక ద్వారా ఇప్పటివరకు 49.7 కోట్ల కంటే ఎక్కువ మంది ఉచితంగా టెలీకన్సల్టేషన్ ద్వారా నిపుణులైన వైద్యుల సలహాలు పొందారు. మారుమూల ప్రాంతాలకు ఉచిత మందులు, డయాగ్నోస్టిక్స్ మరియు డయాలసిస్ సేవలను విస్తరించడం ద్వారా సామాన్యులపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించగలిగామని వివరించారు.

ప్రపంచ ఆరోగ్య సవాళ్ల నిర్మూలన దిశగా భారత్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని విశ్వవేదికపై శ్రీవాస్తవ పునరుద్ఘాటించారు. 2030 నాటికి హెపటైటిస్ బి మరియు సి వ్యాధులను ముప్పుగా లేకుండా నిర్మూలించడమే లక్ష్యంగా జాతీయ కార్యక్రమాలు వేగవంతం చేశామన్నారు. హెపటైటిస్ స్క్రీనింగ్ ద్వారా ఇప్పటివరకు 22.5 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దీనికి తోడు సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద 7.29 కోట్లకు పైగా ప్రజలకు క్షేత్రస్థాయిలో పరీక్షలు పూర్తి చేసి దాదాపు 5 కోట్ల డిజిటల్ సికిల్ సెల్ కార్డులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వైద్యారోగ్య రంగాన్ని సమగ్రంగా పునర్నిర్మిస్తూ భారత్ చేపడుతున్న ఇటువంటి చర్యలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ ప్రతినిధులు కొనియాడారు.