BREAKING
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు లింగ వివక్షతను ఆపండి ఆడపిల్లను కాపాడండి నినాదంతో పోటీలు వేలాడే విద్యుత్ తీగలతో ప్రమాదం గాలి వానకు రోడ్డుపై విరిగిపడిన చెట్టు రోగ్ ఏఐ ముప్పు వెనుక ఉన్న అసలు కారణాలు పులివెందుల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఏం సుభాన్ సిగ్మా మూవీలో డిఫరెంట్ రోల్ చేశా.. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా ఇంటర్వ్యూ విశేషాలు మేకవనంపల్లి పీఏసీఎస్‌ను మరింత బలోపేతం చేస్తా ఆసియా క్రీడల్లో భారత బాక్సింగ్‌కు నిరాశ ఐఐఎం కాశీపూర్ డెహ్రాడూన్ క్యాంపస్‌కు శంకుస్థాపన పకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం గుజరాత్‌లో బి.ఆర్. అంబేద్కర్ మ్యూజియం ప్రారంభం ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబుకు ఊహించని ప్రశ్న.. నెటిజన్ల ఆగ్రహం ఆసియా క్రీడల్లో భారత్ హాకీ హ్యాట్రిక్ విజయం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు

జాతీయ వచ్చిందా రక్తదాన దినోత్సవం

Select Suryaa Now
జాతీయ వచ్చిందా రక్తదాన దినోత్సవం

*రక్తదానం – అవయవ దానం – హెచ్‌ఐవీపై అవగాహన కల్పించిన వైద్యాధికారులు*

*జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం, జాతీయ సేవా పథకం సందర్భంగా అవగాహన కార్యక్రమం*

పులివెందుల మేజర్ న్యూస్ :

ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ  సహకారంతో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం మరియు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) కార్యక్రమాల సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఆహార సాంకేతిక కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, స్నేహిత అమృత హస్తం సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పులివెందుల ఆహార సాంకేతిక కళాశాలలో రక్తదానం, అవయవ దానం, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. ఖాజా మొయిద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, ఒక్క యూనిట్ రక్తం ద్వారా మూడు నుంచి నాలుగు మంది వరకు రోగులకు జీవనాధారం కల్పించవచ్చని తెలిపారు. ప్రమాదాలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, రక్తహీనత వంటి పరిస్థితుల్లో రక్తం అత్యవసరంగా అవసరమవుతుందని, అందువల్ల ఆరోగ్యవంతులైన యువత నిరంతరం స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, సమాజంలో ఉన్న అపోహలను తొలగించి మరింత మంది దాతలను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆహార సాంకేతిక కళాశాల ఇన్‌ఛార్జ్ అసోసియేట్ డీన్ డాక్టర్ అరుణ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే మానవతా విలువలు అలవర్చుకోవాలని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెరుగుతుందని, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని సూచించారు. రక్తదానం, నేత్రదానం, అవయవదానం వంటి సేవా కార్యక్రమాలు మానవత్వానికి నిదర్శనమని తెలిపారు. ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సుఖ వ్యాధుల వ్యాప్తి మార్గాలు, నివారణ చర్యలు, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యత గురించి వివరించారు. హెచ్‌ఐవీ పట్ల సమాజంలో ఇప్పటికీ ఉన్న అపోహలు, వివక్ష భావాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సరైన అవగాహన, జాగ్రత్తలతో హెచ్‌ఐవీ వ్యాప్తిని అరికట్టవచ్చని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని సూచించారు.
ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ నజ్మా, డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందుతున్నాయని తెలిపారు. రక్తదానం వంటి కార్యక్రమాలు యువతను సమాజ సేవ వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు మొమ్మెల రాజు మాట్లాడుతూ, రక్తదానం, నేత్రదానం, అవయవ దానాలపై సమాజంలో మరింత విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం అవయవ దానం చేయడం ద్వారా అనేక మందికి కొత్త జీవితం ప్రసాదించవచ్చని తెలిపారు. నేత్రదానం ద్వారా అంధులకు వెలుగు అందించవచ్చని, ప్రతి కుటుంబం దాతృత్వ భావనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత స్వచ్ఛందంగా దాతలుగా నమోదు చేసుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్న భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీలో “రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి”, “అవయవ దానం మహాదానం”, “నేత్రదానం చేయండి – అంధులకు వెలుగు ఇవ్వండి”, “హెచ్‌ఐవీపై అవగాహన పెంచండి – వివక్షను దూరం చేయండి” వంటి నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీని చూసిన స్థానిక ప్రజలు కూడా దాతృత్వ కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరిచారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ప్రదీప్, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సిబ్బంది, స్నేహిత అమృత హస్తం సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.