BREAKING
ఐరాస వేదికగా భారత్ ఆరోగ్య విప్లవం అమెరికా సెనెట్‌లో యుద్ధ అధికారాల తీర్మానం జాతీయ వచ్చిందా రక్తదాన దినోత్సవం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అసోం పారిశ్రామికీకరణకు మానవ వనరులే అసలైన బలం: ఆర్థిక మంత్రి జయంత మల్ల బారువా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి : రాజ్ థాకరే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది... జాగ్రత్త ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్: ఆదివారం కూడా తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి!

అనాధల సేవకులు నరసన్న కు మాచాని పరామర్శ

Select Suryaa Now
అనాధల సేవకులు నరసన్న కు మాచాని పరామర్శ

అనాధల సేవకుడు నరసన్నకు మాచాని సోమనాథ్ ఆర్థిక సహాయం

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, అనాథాశ్రమం ద్వారా అనాథలు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ, వారి ఆకలి తీర్చడంతో పాటు అనాథ పిల్లలకు విద్య అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సింగనేటి నరసన్నను రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ మాచాని సోమనాథ్ గురువారం పరామర్శించారు.
ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడి చేతికి శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నరసన్నను ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. నరసన్న ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుడిగా తగిన సలహాలు, సూచనలు అందించారు.
నరసన్న త్వరగా కోలుకుని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తూ రూ.15 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నరసన్న చేస్తున్న సేవలను మాచాని సోమనాథ్ అభినందించారు.