BREAKING
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'కళ్యాణం కమనీయం జీవితం' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే? నన్ను ఎంతైనా అవమానించండి.. ప్రజలు మాత్రం ఇప్పుడైనా మేల్కొండి: యాంకర్ రష్మి గౌతమ్! రైతు కూలీల సమస్యలపై ఐక్య పోరాటం యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది?

యురేనియం టైలింగ్ పాండ్ పై అధికారులు పరిశీలన

Select Suryaa Now
యురేనియం టైలింగ్ పాండ్ పై అధికారులు పరిశీలన

*యురేనియం టెయిలింగ్ పాండ్‌పై అధికారుల పరిశీలన*

*కేకే కొట్టాల* గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయం

వేముల మేజర్ న్యూస్ :

యురేనియం టెయిలింగ్ పాండ్ కారణంగా *కేకే కొట్టాల* గ్రామానికి ఎదురవుతున్న ఇబ్బందులు, పర్యావరణ సమస్యలను గ్రామస్తులు మంగళగిరి లోని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఉపముఖ్యమంత్రి కార్యాలయం.. కాలుష్య నియంత్రణ మండలి అధికారులను టెయిలింగ్ పాండ్‌ను పరిశీలించి, సమస్యలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఈ నేపథ్యంలో గురువారం వేముల మండలం కేకే కొట్టాల గ్రామ సమీపంలోని యురేనియం టెయిలింగ్ పాండ్‌ను కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సుధా సందర్శించారు. టెయిలింగ్ పాండ్ పరిసరాలను పరిశీలించి, అక్కడి పరిస్థితులను అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మబ్బుచింతలపల్లి మాజీ సర్పంచ్ *చాపాటి శ్రీనాథ్ రెడ్డి* ,పొల్యూషన్ బోర్డు ఈఈ సుధా కి టెయిలింగ్ పాండ్ నిర్మాణం,దాని పరిసర ప్రాంతాల్లో గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సవివరంగా వివరించారు. గ్రామ ప్రజల ఆందోళనలు, పర్యావరణ పరమైన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు అధికారులు టెయిలింగ్ పాండ్‌పై పరిశీలన చేపట్టడం పట్ల కేకే కొట్టాల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో కొట్టె శ్రీనాథ్, సింగంశెట్టి శివ ప్రసాద్ , సింగంశెట్టి శ్రీనువాసులు, పాల్గొన్నారు.