BREAKING
పకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధం గుజరాత్‌లో బి.ఆర్. అంబేద్కర్ మ్యూజియం ప్రారంభం ఇంటర్వ్యూలో సంపూర్ణేష్ బాబుకు ఊహించని ప్రశ్న.. నెటిజన్ల ఆగ్రహం ఆసియా క్రీడల్లో భారత్ హాకీ హ్యాట్రిక్ విజయం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి కమిషనర్ రాహుల్ మీనా రైతు సంక్షేమమే ధ్యేయం ఆసియా క్రీడల్లో భారత్‌కు కలిసివచ్చిన అథ్లెటిక్స్.. మిక్స్‌డ్ రిలే ఫైనల్‌కు భారత జట్టు అర్హత గుండె ఆరోగ్యంపై వైద్య నిపుణుల హెచ్చరిక: ముందస్తు స్క్రీనింగ్, ఆరోగ్యకర జీవనశైలే శ్రీరామరక్ష పల్లె పండుగకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం ఇసుక ర్యాంపు ఏర్పాటుకు ప్రజా అభిప్రాయ సేకరణ సీఎం పర్యటనను విజయవంతం చేయాలి :మంత్రి పొన్నం ఒడిశాలో భారీ వర్షాలు, వరదల బీభత్సం ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం..

పేదలకు భోజనం దుస్తులు పంపిణీ

Select Suryaa Now
పేదలకు భోజనం దుస్తులు పంపిణీ

నిరాశ్రయులకు అండగా స్వర్ణాంధ్ర

జోరు వానలో చెదరని సంకల్పం 

ఎక్కువ మందికి భోజనం, దుస్తులు అందించేందుకు ఏర్పాట్లు  చేసాం 

-స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు

తూర్పుగోదావరి

గత మూడు రోజులుగా విపరీతమైన వర్షాల వల్ల ఉపాధి కోల్పోయి న వారికి ,నిరాదరణకు గురై రోడ్డున ఉన్న నిరాశ్రయులకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవ సంస్థ ఆపన్న హస్తం అందించింది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఉచిత అన్నదాన శిబిరాల ద్వారా భోజన  సౌకర్యం కల్పించి అన్నార్తులను ఆదుకుంది. ప్రతికూల వాతావరణంలో బయటకు రావడం భయపడుతున్న విపత్కర పరిస్థితులను   ఎదురొడ్డి  స్వర్ణాంధ్ర స్వచ్చంద సేవకులు అవసరార్థులకు భోజనం అందించేందుకు శ్రమిస్తున్నారని నిర్వాహకులు రాంబాబు ప్రశంసించారు. 

ప్రతిరోజు కంటే అదనంగా 200 మందికి  భోజనం ఏర్పాటు చేశామని రాంబాబు అన్నారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవకులు రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద 350 మందికి, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 350 మందికి ప్రత్యేక అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఉదయం 11:30 గంటల నుండి అందించారు. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు తన సిబ్బంది సేవకులను  సమన్వయం చేస్తూ  తెల్లవారుజాము నుండే వంటలు చేయించడం అవి శిబిరాలకు చేర్చేందుకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెరిగిన ధరలు ఒకపక్క ,వర్షాల వల్ల కరెంటు లేక త్రాగునీరు లేకపోయినా వంట చెరుకు ఇబ్బందులను ఎదుర్కొని  నిరాశ్రయులకు సమయానికి భోజనం అందించేందుకు కృషి చేస్తున్నామని రాంబాబు తెలిపారు. అవసరమైన వారికి దుస్తులను కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. ఉచిత అన్నదాన సేవలకు సహకరిస్తున్న దాతలకు, స్వర్ణాంధ్ర సభ్యులకు, స్వచ్ఛంద సేవకులకు రాంబాబు కృతజ్ఞతలు  తెలిపారు.  ఉచిత అన్నదాన సేవలకు సహకరిస్తున్న దాతలకు, స్వర్ణాంధ్ర సభ్యులకు, స్వచ్ఛంద సేవకులకు రాంబాబు కృతజ్ఞతలు  తెలిపారు.