BREAKING
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి : రాజ్ థాకరే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది... జాగ్రత్త ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్: ఆదివారం కూడా తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి! మర్రిపాలెం లో పులి కలకలం.. నాలుగు పశువులు మృతి అత్తాపూర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి పేదలకు భోజనం దుస్తులు పంపిణీ యురేనియం టైలింగ్ పాండ్ పై అధికారులు పరిశీలన ఓడిపోయిన వాళ్లు ఇలాగే మాట్లాడతారు, అది వారి నైరాశ్యం: సీఈసీపై వివాదాస్పద వ్యాఖ్యలపై ముకేశ్ సహానీకి మనోజ్ తివారీ కౌంటర్

రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి:ఏవో మాధవి లత

Select Suryaa Now
రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి:ఏవో మాధవి లత

 

  ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు రైతుల నమోదు కీలకం

కీసర, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24):
     వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు రైతులకు నేరుగా అందాలంటే వారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో సక్రమంగా నమోదు కావడం అత్యంత కీలకమని కీసర మండల వ్యవసాయ అధికారి మాధవి లత స్పష్టం చేశారు. 
  ఈ నేపథ్యంలో కీసర మండలంలోని ప్రతి రైతు ఆలస్యం చేయకుండా వెంటనే రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు.

*వారంలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి:*
    ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ,.. మండల వ్యాప్తంగా మొత్తం 9,071 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 5,240 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఇంకా 3,831 మంది రైతుల నమోదు పెండింగ్‌లో ఉందని, వారంలోగా ఈ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని కోరారు.
          క్లస్టర్ల వారీగా చూస్తే కీసర క్లస్టర్‌లో మొత్తం 5,783 మంది రైతులకు గాను 3,315 మంది నమోదు చేసుకోగా, ఇంకా 2,468 మంది పెండింగ్‌లో ఉన్నారని వివరించారు. అలాగే యాద్గార్‌పల్లి క్లస్టర్‌లో మొత్తం 3,288 మంది రైతులకు గాను 1,925 మంది పూర్తి చేయగా, 1,363 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

*గ్రామాల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమాలు:
        ఇందులో భాగంగా మండలంలోని కరీంగూడ, రాంపల్లి గ్రామాల్లో గురువారం రైతు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించినట్లు ఏఈఓ మనోజ రెడ్డి తెలిపారు. అలాగే యాదగార్‌పల్లి, తిమ్మాయిపల్లి గ్రామాల్లో ఏఈఓ లిఖిత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

*ఏఈఓలను సంప్రదించి నమోదు చేసుకోవాలి:*
         రైతులు తమ సమీపంలోని ఏఈఓ, మీ-సేవ లేదా సీఎస్‌సీ కేంద్రాలను సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని ఏవో తెలిపారు. ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పట్టాదారు పాస్‌బుక్ వివరాలు, మొబైల్ నంబర్ తదితర వివరాలు దీనికి అవసరమవుతాయని, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ జరుగుతుందని పేర్కొన్నారు.


             కేంద్రాలకు ప్రత్యక్షంగా రాలేని రైతులు క్లస్టర్ ఏఈఓలకు ఫోన్ ద్వారా ఓటీపీ సమాచారం తెలియజేసి కూడా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించారు. ఇందుకోసం కీసర క్లస్టర్ పరిధిలోని రైతులు ఏఈఓ మనోజ రెడ్డి (+91 90002 16288), యాద్గార్‌పల్లి క్లస్టర్ పరిధిలోని రైతులు ఏఈఓ లిఖిత (+91 77026 20434) ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. రైతులందరూ అవసరమైన ఆధారాలను సిద్ధంగా ఉంచుకుని త్వరితగతిన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.రిపోర్టర్ కర్రె గణేష్