BREAKING
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి : రాజ్ థాకరే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది... జాగ్రత్త ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్: ఆదివారం కూడా తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి! మర్రిపాలెం లో పులి కలకలం.. నాలుగు పశువులు మృతి అత్తాపూర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి పేదలకు భోజనం దుస్తులు పంపిణీ యురేనియం టైలింగ్ పాండ్ పై అధికారులు పరిశీలన ఓడిపోయిన వాళ్లు ఇలాగే మాట్లాడతారు, అది వారి నైరాశ్యం: సీఈసీపై వివాదాస్పద వ్యాఖ్యలపై ముకేశ్ సహానీకి మనోజ్ తివారీ కౌంటర్

అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి

Select Suryaa Now
అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి

అనంతపురం బ్యూరో

 

అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి

కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ధర్నా

 

 వర్షాభావం, ఎల్‌నినో ప్రభావం, తీవ్ర ఉష్ణోగ్రతలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, ఐఎఫ్‌టీయూ, రాయలసీమ విద్యావంతుల వేదిక, ఎస్సీ–ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

సంగమేశ్ సర్కిల్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న నాయకులు అనంతపురం జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి రైతులకు పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, హార్టికల్చర్ రైతులకు ఎకరాకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని కోరారు.

ఉపాధి హామీ పనిదినాలను 200 రోజులకు పెంచి, రోజువారీ కూలీని రూ.500కు పెంచాలని నాయకులు డిమాండ్ చేశారు. పెనకచెర్ల, పీఏబీఆర్ డ్యామ్‌లకు నీటిని విడుదల చేసి ఆయకట్టు పంటలకు సాగునీరు అందించాలని కోరారు. సోలార్, విండ్ ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములపై ఒత్తిడి తేవడం నిలిపివేసి, రైతుల భూములు, హక్కులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి కరువు సహాయక చర్యలు చేపట్టకపోతే రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి.సురేష్, వేమన, వెంకటేష్, సాకే హరి, దావీద్ తదితరులు పాల్గొన్నారు.