BREAKING
అసోం పారిశ్రామికీకరణకు మానవ వనరులే అసలైన బలం: ఆర్థిక మంత్రి జయంత మల్ల బారువా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి : రాజ్ థాకరే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది... జాగ్రత్త ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్: ఆదివారం కూడా తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి! మర్రిపాలెం లో పులి కలకలం.. నాలుగు పశువులు మృతి అత్తాపూర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి పేదలకు భోజనం దుస్తులు పంపిణీ యురేనియం టైలింగ్ పాండ్ పై అధికారులు పరిశీలన

స్కూల్ బస్సు ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకోవాలి

Select Suryaa Now
స్కూల్ బస్సు ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకోవాలి

స్కూల్ బస్సు ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకోవాలి

డీటీసీకి పీఎస్‌ఎఫ్ వినతి

అనంతపురం: బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం సమీపంలో అనంతలక్ష్మి విద్యా సంస్థలకు చెందిన స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెస్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (పీఎస్‌ఎఫ్) డిమాండ్ చేసింది.

ఈ మేరకు పీఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతిభా భారతి ఆధ్వర్యంలో రవాణా శాఖ డీటీసీకి వినతిపత్రం అందజేశారు. బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉండగా, ఆటోను ఓవర్‌టేక్ చేసే సమయంలో బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైందని, ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ, డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతలక్ష్మి విద్యా సంస్థలతో పాటు జిల్లాలోని అన్ని పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌ను సమగ్రంగా తనిఖీ చేయాలని, నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పీఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సాహిత్ తదితరులు పాల్గొన్నారు.