అడ్వకేట్ నెరమెట్ల ఎల్లన్నకు ఘన సత్కారం
అనంతపురం బ్యూరో:
అడ్వకేట్ నెరమెట్ల ఎల్లన్నకు ఘన సత్కారం
అనంతపురం ఎన్జీవో హోమ్‌లో జిల్లా పూర్వ విప్లవ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో అడ్వకేట్ నెరమెట్ల ఎల్లన్నకు ఘన సత్కారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకుని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
రాజారాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పూర్వ విప్లవ విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాజిక సేవతో పాటు ఉన్నత విద్యను అభ్యసించి న్యాయవాదిగా ఎదిగిన ఎల్లన్న ప్రస్థానం స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు.
పేదలు, బలహీన వర్గాలకు న్యాయ సేవలు అందిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విరూపాక్షి, మాదాపురం శంకర్, గంగమ్మ, మోపిడి గోవిందు, శంకర్, బండారు కుల్లాయప్ప తదితరులు పాల్గొని ఎల్లన్నకు అభినందనలు తెలిపారు.