BREAKING
జాతీయ వచ్చిందా రక్తదాన దినోత్సవం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అసోం పారిశ్రామికీకరణకు మానవ వనరులే అసలైన బలం: ఆర్థిక మంత్రి జయంత మల్ల బారువా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి : రాజ్ థాకరే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది... జాగ్రత్త ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్: ఆదివారం కూడా తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి! మర్రిపాలెం లో పులి కలకలం.. నాలుగు పశువులు మృతి అత్తాపూర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలి

డిపాజిట్లు పై దుమారం

Select Suryaa Now
డిపాజిట్లు పై దుమారం

డిపాజిట్లపై దుమారం.. రూ.7 కోట్ల జీఎస్టీ బకాయిలు

టి.నరసాపురం సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో ప్రశ్నల వర్షం

టి.నరసాపురం క్రైమ్ మేజర్ న్యూస్:
టి.నరసాపురం సహకార సంఘం సర్వసభ్య సమావేశం బుధవారం సంఘ కార్యాలయం వద్ద కార్యదర్శి సోలా సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. డిపాజిట్ల చెల్లింపులు, సంఘం ఆర్థిక పరిస్థితి, సిబ్బంది సంఖ్య తదితర అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించడంతో కొంతసేపు సమావేశం వాడీవేడిగా సాగింది.
డిపాజిట్లు ఎప్పుడు చెల్లిస్తారని పలువురు డిపాజిట్‌దారులు ప్రశ్నించగా, డిపాజిట్లను రెన్యువల్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని సంఘ చైర్‌పర్సన్ సోంబాబు తెలిపారు. ఇందుకు సభ్యులు, డిపాజిట్‌దారుల అంగీకారం అవసరమని పేర్కొన్నారు.
కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత సహకార సంఘం అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటని కొందరు సభ్యులు ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘంలో హెచ్‌ఆర్ పాలసీ ప్రకారం తొమ్మిది మంది సిబ్బంది అవసరం ఉండగా 17 మంది సిబ్బంది ఎందుకని మరికొందరు ప్రశ్నించారు. దీనిపై సంఘం తరఫున అప్కాబ్ నుంచి ఆర్థిక సహాయం కోరుతున్నామని చైర్‌పర్సన్ తెలిపారు.
అర్హులైన రైతులకు మూడు శాతం రిబేటు కింద సుమారు రూ.30 లక్షలు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. సంఘ వ్యాపారాలకు సంబంధించి సుమారు రూ.7 కోట్ల జీఎస్టీ బకాయిలు ఉన్నాయని, అందులో 10 శాతం అంటే రూ.70 లక్షలు చెల్లించాలని సేల్స్ ట్యాక్స్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పాటు సంఘ ఖాతాలను సీజ్ చేసినట్లు వివరించారు. తాత్కాలిక ఉపశమనం కోసం కోర్టు నుంచి స్టే తీసుకుని సంఘ ఖాతాలను యథావిధిగా కొనసాగిస్తున్నామని తెలిపారు.
సంఘానికి సంబంధించిన వాటర్ ప్లాంట్ అద్దె బకాయిలపై సభ్యులు ప్రశ్నించగా, తాను చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టే నాటికే బకాయిలు ఉన్నాయని, ప్రస్తుతం ప్లాంట్ యాజమాన్యం సంఘానికి సుమారు రూ.93 లక్షలు చెల్లించాల్సి ఉందని సోంబాబు తెలిపారు. ప్లాంట్ లీజుదారుడు తాను నష్టపోయానంటూ కోర్టు ద్వారా నోటీసులు పంపినట్లు చెప్పారు.
సహకార సంఘాన్ని పూర్వ వైభవానికి తీసుకురావడానికి సభ్యులందరూ సామరస్యంగా సహకరించాలని చైర్‌పర్సన్ సోంబాబు కోరారు.
కార్యక్రమంలో కమిటీ సభ్యులు మోదుగు రామారావు, ఉయ్యూరి నాగమణి,అద్దంకి జగ్గారావు, సందేపూడి పినాకపాణి ,సీహెచ్ నవీన్, కన్నం సర్వేశ్వరరావు, శ్రీకాంత్,పాలేటి సత్తిబాబు, చీకటి బుజ్జి, కటకం మల్లిఖార్జునరావు,కొండ తోపాటు సంఘ సభ్యులు  పాల్గొన్నారు.