BREAKING
ఐరాస వేదికగా భారత్ ఆరోగ్య విప్లవం అమెరికా సెనెట్‌లో యుద్ధ అధికారాల తీర్మానం జాతీయ వచ్చిందా రక్తదాన దినోత్సవం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అసోం పారిశ్రామికీకరణకు మానవ వనరులే అసలైన బలం: ఆర్థిక మంత్రి జయంత మల్ల బారువా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి : రాజ్ థాకరే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది... జాగ్రత్త ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్: ఆదివారం కూడా తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి!

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే సునీత

Select Suryaa Now
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే సునీత

అనంతపురం బ్యూరో

 

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే సునీత

రాప్తాడు సమీపంలోని పండమేరు వాగు వద్ద అభివృద్ధి పనులతో పాటు జేఎన్‌టీయూ నుంచి రాప్తాడు వరకు చేపట్టనున్న రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 10 మంది దివ్యాంగులకు రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామితో కలిసి రూ.12.50 లక్షల విలువైన మూడు చక్రాల మోటారు వాహనాలను వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు.

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు జీఓ నంబర్‌ 5 ద్వారా మినిమం టైం స్కేల్ వర్తింపజేయడంపై ఉద్యోగులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ఆమె అన్నారు.

ఇదిలా ఉండగా రాచానపల్లి పంచాయతీ సిండికేట్ నగర్‌కు చెందిన దుర్గశ్రీ పుత్తూరులోని అన్నా గౌరీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించడంతో ఎమ్మెల్యే ఆమెను అభినందించారు.