పంతంగిలో జడ్పీ సీఈవో శోభారాణి పర్యటన
పంతంగిలో జడ్పీ సీఈవో శోభారాణి పర్యటన
చౌటుప్పల్: మండలంలోని పంతంగి గ్రామాన్ని జడ్పీ సీఈవో శోభారాణి గురువారం సందర్శించారు. గ్రామంలో మంజూరైన ఆర్‌అండ్‌బీ రహదారి పనులను పరిశీలించారు. అనంతరం జరుగుతున్న పంట కుంట పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి గ్రామ అభివృద్ధి పనులపై చర్చించారు.
ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో తలెత్తే నీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని పంట కుంటలు, నీటి కుంటలు, ఇంకుడు గుంతలను పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలోని చెరువులో పూడికతీత చేపట్టి నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత సుందర్, వార్డు సభ్యులు సప్పిడి ప్రభాకర్‌రెడ్డి, మాధవుని పరమేశ్వరి, శంకర్, పంచాయతీ కార్యదర్శి పద్మజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మాజీ సర్పంచ్ అంతటి రమేష్‌గౌడ్, కడగంచి చలమందరాజు, కడగంచి జనార్ధన్, పబ్బు లింగస్వామి, కడగంచి వెంకటేశం, బోయ దశరథ, ఏపీవో ఈశ్వరయ్య, ఈసీ రమాదేవి, టీఏ నీల, ఫీల్డ్ అసిస్టెంట్ లలిత తదితరులు పాల్గొన్నారు.