BREAKING
మెడికల్ మాఫియా పై నియంత్రణ లేదా? రోడ్డుపై చేరిన నీరు, నాటు వేస్తూ నిరసన తెలిపిన మహిళలు అనాధల సేవకులు నరసన్న కు మాచాని పరామర్శ అడ్వకేట్ నెరమెట్ల ఎల్లన్నకు ఘన సత్కారం పంతంగిలో జడ్పీ సీఈవో శోభారాణి పర్యటన భారీ వర్షానికి జలమయమైన కనగర్తి పాఠశాల డిపాజిట్లు పై దుమారం అర్జెంటీనాలో పెరిగిన పేదరికం బాలీవుడ్ బాక్సాఫీస్ ట్రెండ్ మార్పు.. మళ్లీ హారర్ కామెడీ, థ్రిల్లర్ సినిమాల జోరు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే సునీత స్కూల్ బస్సు ప్రమాదంపై కఠిన చర్యలు తీసుకోవాలి అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి:ఏవో మాధవి లత విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి రిలీజ్ డేట్ ఫిక్స్.. దసరా బరిలో ఫాదర్ సెంటిమెంట్ మూవీ ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీకి ఇండోనేషియా క్రికెట్ చైర్మన్ అభిరామ్ సింగ్ యాదవ్ ఎన్నిక

28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె..!

Select Suryaa Now
28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె..!

 

ఖాతాదారులు బ్యాంకింగ్‌ పనులు ముందుగానే పూర్తి చేసుకోవాలి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్( సెప్టెంబర్ 24):భారత ప్రభుత్వ ఆర్థిక శాఖతో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్లు సమాచారం. దీంతో మూడు రోజుల పాటు బ్యాంకు శాఖల్లో ప్రత్యక్షంగా అందించే పలు సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖాతాదారులు తమ బ్యాంకింగ్‌ అవసరాలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.సమ్మె నేపథ్యంలో నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, చెక్కుల జమ, నగదు లావాదేవీలు, ఇతర శాఖాపరమైన పనులు ఉంటే ఈ నెల 27లోగా పూర్తి చేసుకోవడం మంచిది. అత్యవసర నగదు అవసరాల కోసం ముందుగానే ఏటీఎం ద్వారా నగదు తీసుకోవాలని సూచించారు.

డిజిటల్‌ సేవలు అందుబాటులో ఉండే అవకాశం

బ్యాంకుల సమ్మె సమయంలో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యూపీఐ, ఏటీఎం వంటి డిజిటల్‌ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే ఆయా బ్యాంకుల సాంకేతిక పరిస్థితులను బట్టి సేవల్లో మార్పులు ఉండొచ్చని ఖాతాదారులు గమనించాలి. రుణ వాయిదాలు, విద్యుత్‌ బిల్లులు, ఇతర చెల్లింపులకు గడువు సమీపిస్తుంటే ముందుగానే చెల్లింపులు చేయడం ద్వారా ఇబ్బందులను నివారించవచ్చు.సమ్మె తేదీలను దృష్టిలో ఉంచుకుని ఖాతాదారులు తమ బ్యాంకింగ్‌ పనులను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని బ్యాంకింగ్‌ వర్గాలు సూచిస్తున్నాయి.రిపోర్టర్ బాల్ రెడ్డి