వ్యర్థాలతో విలువైన వస్తువుల తయారీపై విద్యార్థులకు అవగాహన
సూర్య జగిత్యాల ప్రతినిధి: కొరుట్ల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా–2026 కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు “వేస్ట్ టు వెల్త్”, వ్యర్థ పదార్థాలను ఉపయోగించి పునర్వినియోగ వస్తువుల తయారీ, అలాగే నాలుగు రకాల వ్యర్థాల వేరు చేయడం పై అవగాహన కల్పించారు. వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి, పునర్వినియోగం ద్వారా విలువైన వస్తువులను తయారు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణకు కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు.