BREAKING
ఊపిరితిత్తులను నిర్లక్ష్యం చేయొద్దు! పీవోజేకేలో శాంతియుత నిరసనలపై పాక్ ఉక్కుపాదం: స్వతంత్ర విచారణ కమిషన్ వేయాలని ఐరాసను కోరిన హక్కుల కార్యకర్తలు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మైదుకూరులో హాట్ కామెంట్స్ అమెరికా బెదిరింపులను తిరస్కరించిన ఇరాన్: బలప్రయోగం లేని సమానత్వ చర్చలకు సిద్ధమని స్పష్టీకరణ దేవుని కడపలో పవిత్రోత్సవాలు ప్రారంభం భారీ వర్షాలపై విశాఖ కలెక్టర్ సమీక్ష: అధికారులకు హైఅలర్ట్, తక్షణమే నష్టం అంచనాకు ఆదేశాలు ఎర్రచందనం మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ జాకీర్ కు రిమ్స్ లో చికిత్స టీపీసీసీ చీఫ్ ను కలిసిన వసంతం రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. సుకుమార్ తదుపరి చిత్రం కోసం ఏకంగా 15 కిలోలు తగ్గుతున్న మెగా హీరో ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం శర్వానంద్ జార్జ్ క్రిష్ మూవీ నుంచి స్పెషల్ బూస్టర్ అప్డేట్.. డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్ నిఘా వ్యవస్థకు గ్రహణం.! కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఆంధ్రప్రదేశ్ అంతర్గత జల మార్గముల బలోపేతం, కార్గో మరియు టూరిజం అభివృద్ధికి సహకరించండి. నల్లగొండ జిల్లా .... యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్.

గొల్లపల్లిలో విషాదం.. మాజీ ఎంపీటీసీ ఆకస్మిక మృతి

Select Suryaa Now
గొల్లపల్లిలో విషాదం.. మాజీ ఎంపీటీసీ ఆకస్మిక మృతి

 

- బీఆర్ఎస్ నేతల పరామర్శ

 రూ. 20,000 ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ కొండా రమేష్

సూర్య, ఎల్లారెడ్డిపేట:

స్నానం చేస్తుండగా గుండెపోటు రావడంతో మాజీ ఎంపీటీసీ బొల్లి లింగం (70) మృతి చెందిన విషాద ఘటన ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లి లింగం గురువారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై కిందపడిపోయారు.
కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. లింగం 2001లో ఎంపీటీసీగా పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. ఆయనకు భార్య హనుమవ్వ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రూ. 20,000 ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ కొండా రమేష్


బొల్లి లింగం మృతి విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సర్పంచ్ కొండ రమేష్ గౌడ్‌తో కలిసి పార్టీ తరఫున అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.20,000 అందజేశారు. లింగం మృతి పట్ల సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అందే బాలయ్య తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.