ఆంధ్రప్రదేశ్ అంతర్గత జల మార్గముల బలోపేతం, కార్గో మరియు టూరిజం అభివృద్ధికి సహకరించండి.
ఆంధ్రప్రదేశ్ అంతర్గత జల మార్గముల బలోపేతం, కార్గో మరియు టూరిజం అభివృద్ధికి సహకరించండి.
అమరావతి, మేజర్ న్యూస్ : నేషనల్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ శ్రీ సాహిల్ కుమార్ ఐఏఎస్ గారికి విన్నవించిన APIWA ఛైర్మన్ డా. జెడ్. శివ ప్రసాద్. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, APIWA ఛైర్మెన్ డా.జెడ్.శివ ప్రసాద్ నేతృత్వంలో ఢిల్లీకి తరలివెళ్లిన ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ అధికారుల బృందం. బీసీ జనార్థన్ రెడ్డి గారి సూచనల మేరకు ఏపీ కార్గో - టూరిజం అభివృద్ధి అవకాశాలు, కీలక ప్రాజెక్ట్ లను ఢిల్లీలో ప్రదర్శించిన APIWA ఛైర్మెన్ డా.జెడ్.శివ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర రోడ్లు, భవనములు, పెట్టుబడుల శాఖామాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి సూచనల మేరకు ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ డా. జెడ్. శివ ప్రసాద్ నేతృత్వంలోని APIWA బృందం నోయిడా లోని ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో IWA నేషనల్ ఛైర్మెన్ శ్రీ సాహిల్ కుమార్ ఐఏఎస్ గారిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి అవకాశం ఉన్న పలు కార్గో - టూరిజం కీలక ప్రాజెక్ట్ లను వారి దృష్టికి తీసుకువచ్చారు. కృష్ణా నదిపై ముక్త్యాల నుండి మచిలీపట్నం వరకు 168 కిలోమీటర్ల మేర రవాణా అవసరాలు, కార్గో - టూరిజం కోసం ఫెయిర్ వే నిర్మాణం చేపట్టవల్సిందిగా కోరడం జరిగింది. జులై, 2027 లో జరగనున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి నదిపై సర్ ఆర్థన్ కాటన్ బ్యారేజ్ నుండి పోలవరం వరకు 40 కి.మీ. మేర టూరిజం అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. అమరావతి కేంద్రంగా కృష్ణా నదిపై వాటర్ మెట్రో ఏర్పాటుకు అనుకూలమైన అంశాల పట్ల అధ్యయనం చేయవలసిందిగా కోరడం జరిగింది. సంబంధిత ప్రాజెక్ట్ లను IWA నేషనల్ ఛైర్మెన్ శ్రీ సాహిల్ కుమార్ ఐఏఎస్ మరియు డైరెక్టర్ టెక్నికల్ శ్రీరాజ్ షిండే లకు వివరించగా వారు సానుకూలంగా స్పందించారు, ఈ సందర్బంగా వారికి APIWA ఛైర్మన్ డా. జెడ్. శివ ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు