BREAKING
పీవోజేకేలో శాంతియుత నిరసనలపై పాక్ ఉక్కుపాదం: స్వతంత్ర విచారణ కమిషన్ వేయాలని ఐరాసను కోరిన హక్కుల కార్యకర్తలు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మైదుకూరులో హాట్ కామెంట్స్ అమెరికా బెదిరింపులను తిరస్కరించిన ఇరాన్: బలప్రయోగం లేని సమానత్వ చర్చలకు సిద్ధమని స్పష్టీకరణ దేవుని కడపలో పవిత్రోత్సవాలు ప్రారంభం భారీ వర్షాలపై విశాఖ కలెక్టర్ సమీక్ష: అధికారులకు హైఅలర్ట్, తక్షణమే నష్టం అంచనాకు ఆదేశాలు ఎర్రచందనం మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ జాకీర్ కు రిమ్స్ లో చికిత్స టీపీసీసీ చీఫ్ ను కలిసిన వసంతం రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. సుకుమార్ తదుపరి చిత్రం కోసం ఏకంగా 15 కిలోలు తగ్గుతున్న మెగా హీరో ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం శర్వానంద్ జార్జ్ క్రిష్ మూవీ నుంచి స్పెషల్ బూస్టర్ అప్డేట్.. డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్ నిఘా వ్యవస్థకు గ్రహణం.! కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఆంధ్రప్రదేశ్ అంతర్గత జల మార్గముల బలోపేతం, కార్గో మరియు టూరిజం అభివృద్ధికి సహకరించండి. నల్లగొండ జిల్లా .... యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్. వినాయకుడిని దర్శించుకున్న డీఎస్పీ

ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ధ్యేయం..

Select Suryaa Now
ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ధ్యేయం..

ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ధ్యేయం..

- వైద్యాధికారిణి డాక్టర్ కిరణ్ రిషిత వెల్లడి..

▪️ఎమ్మార్వో కాలనీలో ఉచిత వైద్య శిబిరం..

▪️బీపీ, షుగర్‌ పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ..


పొదలకూరు, సెప్టెంబర్ 24: ప్రజలకు వైద్య సేవలను వారి నివాస ప్రాంతాల వద్దకే అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా గురువారం పొదలకూరు ఎమ్మార్వో కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో కాలనీ వాసులు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి డాక్టర్‌ కిరణ్‌ రిషిత మాట్లాడుతూ.. మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి కారణంగా చాలామంది రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. వీటిని తొలిదశలోనే గుర్తించి, వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటే గుండె, కిడ్నీ తదితర సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మందుల వినియోగం, మోతాదు, పౌష్టికాహారం, నివారించాల్సిన ఆహార పదార్థాలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం సబ్‌-యూనిట్‌ అధికారి అంజనేయ వర్మ పర్యవేక్షణలో జరిగింది. ఆరోగ్య విస్తరణాధికారి రవి కుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు ఏ. మస్తాన్‌బీ, ఆరోగ్య సహాయకులు ఎం. రాధాకుమారి, ఎం ఎల్ హెచ్ పి  సుమాంజలి స్క్రీనింగ్‌, కౌన్సెలింగ్‌ సేవలు అందించారు. స్థానిక ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు శిబిరంపై అవగాహన కల్పించి, వారిని వైద్య శిబిరానికి తరలించారు.