వినాయకుడిని దర్శించుకున్న డీఎస్పీ
చౌటుప్పల మండల నేలపట్ గ్రామంలో ఏకదంత యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామివారిని చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్‌రెడ్డి, సీఐ మన్మధకుమార్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకదంత యూత్ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డు సభ్యులు అనురాధ శ్యామ్, బుట్టి బాలరాజు, వసంత, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చౌట శివకుమార్‌గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పబ్బు వంశీగౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు పబ్బతి వెంకటేశంగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా రాములు, తడక వెంకటేష్, కమ్యూనిస్టు పార్టీ గ్రామ కార్యదర్శి బుట్టి కృష్ణ, ఏకదంత యూత్ సభ్యులు పాలమాకుల సాయి, పబ్బు చింటూ, స్నానం చెర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు