BREAKING
రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. సుకుమార్ తదుపరి చిత్రం కోసం ఏకంగా 15 కిలోలు తగ్గుతున్న మెగా హీరో ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం శర్వానంద్ జార్జ్ క్రిష్ మూవీ నుంచి స్పెషల్ బూస్టర్ అప్డేట్.. డైరెక్టర్‌కు బర్త్ డే విషెస్ నిఘా వ్యవస్థకు గ్రహణం.! కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఆంధ్రప్రదేశ్ అంతర్గత జల మార్గముల బలోపేతం, కార్గో మరియు టూరిజం అభివృద్ధికి సహకరించండి. నల్లగొండ జిల్లా .... యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్. వినాయకుడిని దర్శించుకున్న డీఎస్పీ బాధిత చిన్నారులకు భరోసా..! బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గంగ సూర్యనారాయణ ది ప్యారడైజ్ మూవీ స్పెషల్ సాంగ్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కీర్తి సురేష్.. నెట్టింట వైరల్ మండల ప్రత్యేక అధికారిగా హరిగోపాల్ బాధ్యతలు ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ధ్యేయం.. గొల్లపల్లిలో విషాదం.. మాజీ ఎంపీటీసీ ఆకస్మిక మృతి బాధ్యతలు చేపట్టిన మండల ప్రత్యేక అధికారి పూర్వ విద్యార్థుల సౌజన్యంతో 190 హౌస్‌ డ్రెస్సుల పంపిణీ...

అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

Select Suryaa Now
అభివృద్ధికి అధిక ప్రాధాన్యం

చేవెళ్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24) : కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు (రజకనగర్‌)లో రూ.21 లక్షల 50వేలతో గురువారం  సీసీ రోడ్డు నిర్మాణ పనులను  మున్సిపల్ చైర్‌పర్సన్ సమతా వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ కాసుల రాము గౌడ్, స్థానిక కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రజకనగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే వార్డు ప్రజలకు రాకపోకల సౌకర్యం మరింత మెరుగుపడుతుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. కౌన్సిలర్ మద్దెల శ్రీనివాస్  మాట్లాడుతూ.. వార్డు ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందన్నారు.14వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు, మున్సిపల్ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, కౌన్సిలర్లు బండారి శైలజాఆగిరెడ్డి, మంగలి కళ్యాణియాదగిరి, బక్కరెడ్డి మాధవియాదిరెడ్డి, తాళ్లపల్లి నర్సింలు, కృష్ణానాయక్, మంగమ్మ మల్లేష్, మున్సిపల్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పెంటయ్యగౌడ్, కో అప్షన్ సభ్యులు రవీందర్ రెడ్డి, ఛాన్ పాషా, మాజీ సర్పంచులు రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్త, పడాల ప్రభాకర్, జహంగీర్, నాయకులు ఎర్ర మల్లేష్, యాదగిరి, ఖదీర్,మద్దెల జంగయ్య, మద్దెల చింటూ, అశోక్  తదితరులు ఉన్నారు.

సోర్స్ సున్నపు ప్రవీణ్