పూర్వ విద్యార్థుల సౌజన్యంతో 190 హౌస్ డ్రెస్సుల పంపిణీ...
పోతుగల్‌లో జెడ్పీహెచ్‌ఎస్‌లో కార్యక్రమం...
సూర్య,ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు మామిండ్ల భూపతి అధ్యక్షతన విద్యార్థులకు ఉచితంగా హౌస్ డ్రెస్సులను పంపిణీ చేశారు.పాఠశాలలోని నాలుగు హౌస్‌లకు చెందిన విద్యార్థులకు సుమారు రూ.80 వేల విలువైన 190 డ్రెస్‌లను పూర్వ విద్యార్థుల సౌజన్యంతో అందజేశారు.రెడ్,గ్రీన్,బ్లూ,ఎల్లో రంగుల్లో హౌస్ డ్రెస్‌లను విద్యార్థులకు పంపిణీ చేశారు.పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిబ్రవరి 13న నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పూర్వ విద్యార్థులు పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించారు.ఆ నిధులతోనే విద్యార్థులకు హౌస్ డ్రెస్సులను అందించినట్లు తెలిపారు.అలాగే బాలుర పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు సంకల్ప సిద్ధి చారిటీ ఆధ్వర్యంలో,బాలికలకు ఏపీఎస్ చైర్మన్ వరి జ్యోతి–వెంకటేష్ సౌజన్యంతో ఎన్‌ఎంఎంఎస్ పుస్తకాలను ఉచితంగా అందజేశారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ,ఎంఈఓ అంబటి రవీందర్, ఉపసర్పంచ్ కోల కృష్ణ,వార్డు సభ్యుడు జంగ రాజు,పెద్దిగారి శ్రీనివాస్,యూత్ లీడర్ వరి వెంకటేష్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.