టీపీసీసీ చీఫ్ ను కలిసిన వసంతం
చేవెళ్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులుగా బి. మహేష్ కుమార్ గౌడ్ రెండు సంవత్సరాల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా టీపీసీసీ క్యాంపెయినర్ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సున్నపు వసంతం మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి జరుగుతుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్‌కు భవిష్యత్తులో మరింత విజయాలు చేకూరాలని భగవంతుని వేడుకున్నారు.
సూర్య రిపోర్టర్ : సున్నపు ప్రవీణ్
-------------------------------