మనమంతా యాంటీ జగన్ – వైసీపీ విధానాలకు మళ్లీ అవకాశం ఇవ్వకూడదు
మనమంతా యాంటీ జగన్ – వైసీపీ విధానాలకు మళ్లీ అవకాశం ఇవ్వకూడదు
ప్రశాంతమైన పాలన, అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మా మద్దతు కూటమి ప్రభుత్వానికే అంటూ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
ప్రజల మద్దతుతో కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న కూటమి ప్రచారంకు విశేష స్పందన లభిస్తోంది.
కిషోర్ గునుకుల జనసేన పార్టీ
నెల్లూరు: నెల్లూరు నగరంలోని 16(21)వ డివిజన్ ఆదిత్య నగర్ లో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ,రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ను గెలిపించండి అంటూ జనసేన నాయకులు గునుకుల కిషోర్, వారి సతీమణి వీరమహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం ఈ రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. గత పాలనలో ఎదురైన పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకూడదని, వైసీపీ ప్రభుత్వం తిరిగి రావద్దనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని తెలిపారు. ప్రచారంలో భాగంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపై పోరాడుతూ, కూటమి ప్రభుత్వంలో తనదైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా శ్రీ పొంగూరు నారాయణ గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించారు. నెల్లూరు నగరంలో మౌలిక వసతులు, పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ, ఏఎంసీ డైరెక్టర్ విజయలక్ష్మి గునుకులతో పాటు వారి మద్దతుదారు శారద గారు,బాలాజీ, ఆమని, నరహరి,బాలు,కృష్ణ మోహన్ రెడ్డి,ప్రశాంత్ గౌడ్,ప్రవల్లిక,విజయ, లక్ష్మి, కృష్ణవేణి, సునీత, సుప్రియ, కల్పన తదితరులు పాల్గొన్నారు.