BREAKING
పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలే కీలకం: హోంమంత్రి వంగలపూడి అనిత ఘనంగా యంగ్ హీరో ప్రిన్స్ వివాహ రిసెప్షన్.. హాజరైన టాలీవుడ్ ప్రముఖులు జెడ్పీ పాలకవర్గ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు అభివృద్ధికి అధిక ప్రాధాన్యం 10th class విద్యార్థికి లక్ష బహుమతి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన నాని ప్యారడైజ్ ప్రీమియర్ షోకు పోలీసుల నో.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భద్రతా కారణాల రీత్యా తిరస్కరణ రీ సర్వే పేరుతో భూమి కుదింపు.. రైతు ఆవేదన దామరచర్ల లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,, మాజీ mla ల బృందం.. తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్‌కు ఘన సన్మానం. ఫేమస్ కాకముందే ఎక్కువ సంపాదించేదాన్ని.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్న కుమారి ఆంటీ స్కూల్ గేమ్స్ ప్రారంభం మదాఓఎలా యురేనియం ప్రాజెక్ట్‌లో వాటాను 40 శాతానికి పెంచుకున్న నైజర్ ప్రభుత్వం ఇంధన ధరలు పెరిగితే వడ్డీ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారమే భావోద్వేగాల ప్రవాహం.. కంటతడి పెట్టించిన పదహారవ ఎపిసోడ్

రోడ్ల రిపేర్లకు రూ.251 కోట్లు

Select Suryaa Now
రోడ్ల రిపేర్లకు రూ.251 కోట్లు

రోడ్ల రిపేర్లకు రూ.251.68 కోట్లు 

613 కి.మీ. రహదారులకు నష్టం

 550 జేసీబీలు, 596 పవర్‌ రంపాలు సిద్ధం

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి

తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 24 గంటలూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. వర్షాల కారణంగా గురువారం ఉదయం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 356 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రహదారులకు ఎక్కువగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు చోట్ల భారీ గుంతలు ఏర్పడి రహదారులు కొట్టుకుపోయాయి. 78 చోట్ల సీడీ వర్క్స్‌ దెబ్బతినగా, ఇప్పటికే 37 చోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. 11 ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా 23 ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, 14 ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించి రాకపోకలను పునరుద్ధరించారు.

వర్షాలకు దెబ్బతిన్న రహదారులను తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు సుమారు రూ.26.95 కోట్లు, శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు రూ.224.73 కోట్లు అవసరమవు తాయని ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తంగా ఆర్‌అండ్‌బీ రహదారుల పునరుద్ధరణకు రూ.251.68 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 78 కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి నోడల్‌ అధికారులను నియమించారు. ఆర్‌అండ్‌బీ శాఖ అనుబంధ విభాగాలతో 36 ఉమ్మడి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రధాన కార్పొరేషన్లలో టోల్‌ఫ్రీ సేవలను ఏర్పాటు చేసి 24 గంటలూ నిరంతర సేవలు అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 614 ప్రాంతాలను సమస్యాత్మక, ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తించారు. రహదారులపై విరిగిపడే చెట్లు, మట్టి, కొండచరియలు తదితర అడ్డంకులను తొలగించేందుకు 550 జేసీబీలు, 596 పవర్‌ రంపాలను సిద్ధంగా ఉంచారు. అత్యవసర సహాయక చర్యలకు అవసరమైన సిబ్బంది, సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు వెల్లడించారు.