రీ సర్వే పేరుతో భూమి కుదింపు.. రైతు ఆవేదన
అనంతపురం బ్యూరో
రీ సర్వే పేరుతో భూమి కుదింపు.. రైతు ఆవేదన
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు నిరసన
రీ సర్వే పేరుతో అధికారులు తమ భూమిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కుదించారని ఆరోపిస్తూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దుగుమర్రి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 6లో తనకు నాలుగు ఎకరాల భూమి ఉందని రైతు సంజీవరెడ్డి తెలిపారు.
అయితే రీ సర్వే ప్రక్రియలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సుమారు 30 సెంట్ల భూమిని తగ్గించి పాస్‌బుక్ జారీ చేశారని ఆయన ఆరోపించారు. తమ ఆధీనంలో ఉన్న భూమిని తమకు తెలియకుండా కుదించడం అన్యాయమని పేర్కొంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూర్చొని తన నిరసనను వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్య ధోరణిపై జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని సంజీవరెడ్డి తెలిపారు. రీ సర్వే పేరుతో కొందరు రైతుల భూముల విస్తీర్ణాన్ని పెంచడం, తగ్గించడం జరుగుతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, రీ సర్వే రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని రైతులు కోరుతున్నారు. అర్హత కలిగిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.