గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్.
గొర్రెల దొంగతనం కేసులో ముగ్గురి రిమాండ్.
సూర్య, ముస్తాబాద్:
ముస్తాబాద్ గ్రామానికి చెందిన బండారి లింగయ్యకు చెందిన మూడు గొర్రెలు, రెండు పొట్టేళ్లు చోరీకి గురైన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై జ్యోతి తెలిపారు. దర్యాప్తులో దుబ్బాక గ్రామానికి చెందిన శ్రీనివాస్, నూనె ప్రభాకర్ గొర్రెలను చోరీ చేసినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ చేసిన గొర్రెలు, పొట్టేళ్లను తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన చింతల రాజు అలియాస్ రవికి విక్రయించినట్లు వెల్లడించారు. దీంతో రవిని కూడా అరెస్ట్ చేసి ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.