మృతుల కుటుంబాలకు మంత్రి పొన్నం పరామర్శ
సూర్య సైదాపూర్
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరామర్శించారు.
దుద్దెనపల్లి: కుందేళ్ల కనకమ్మ, అప్పిడి సుభద్ర, బోరగల్ల పోచమ్మ కుటుంబాలను పరామర్శించారు.
సైదాపూర్: అనగొని రవీందర్‌గౌడ్, మొలగూరి వసంత కుటుంబాలను ఓదార్చారు.
సోమారం: కోల లావణ్య, బూడిద వీరమ్మ కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.