డిసెంబర్లో కెనడా పర్యటనకు ప్రధాని మోదీ: వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం.. కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడి
సూర్య అంతర్జాతీయ డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది డిసెంబర్లో కెనడాలో పర్యటించే అవకాశం ఉందని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ అధికారికంగా ధ్రువీకరించారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల (యూఎన్జీఏ) సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కార్నీ, ఇరు దేశాల మధ్య కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియలో ముందడుగు పడిందని పేర్కొన్నారు. డిసెంబర్ మధ్య నాటికి ఇరు దేశాల చర్చలు కొలిక్కి వస్తాయని, ఆ సమయంలో భారత ప్రధానికి ఆతిథ్యం ఇచ్చేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కార్నీ వెల్లడించారు.
దీంతో గత కొంతకాలంగాభారత్కెనడా మధ్య స్తంభించిన దౌత్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) చర్చలు వేగవంతంగా సాగుతున్నాయని ఉన్నత వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ మొదటి వారంలో ఐదో విడత వాణిజ్య చర్చలు ప్రారంభం కానుండగా, నవంబర్ నాటికి ముసాయిదా ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత ప్రధాని పర్యటన సందర్భంగా వాణిజ్యంతో పాటు రక్షణ, ఏరోస్పేస్, ఉన్నత విద్య, సాంకేతిక ఆవిష్కరణల రంగాల్లో కూడా కీలక ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉందని కెనడాలోని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ వెల్లడించినట్లు కథనాలు పేర్కొన్నాయి.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 70 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలు ముందుకు సాగుతున్నాయి.
గతంలో ఖలిస్థానీ అంశాలు, పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఏర్పడిన దౌత్యపరమైన విభేదాలకు తాజా పరిణామాలు తెరదించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల మధ్య సంబంధాలు, ఆర్థిక సమన్వయం మరియు వ్యూహాత్మక భద్రతా అంశాల్లో భారత్తో భాగస్వామ్యం కెనడాకు అత్యంత కీలకమని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకోవడం ఇరు దేశాల ఆర్థిక ప్రయోజనాలకు అత్యవసరమని కెనడా ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే90 రోజులు భారత్కెనడా ద్వైపాక్షిక సంబంధాలలో చారిత్రక మలుపుగా మారనున్నాయని దౌత్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.