BREAKING
ఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం గ్రాండ్‌గా హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కొత్త చిత్రం ప్రదర్శన  డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్ప పెరుగుదల: ప్రారంభ ట్రేడింగ్‌లో 5 పైసలు బలపడి 95.57 వద్ద నమోదు ఆన్‌లైన్ స్కామ్‌లపై కంబోడియాలో ప్రపంచ సదస్సు నకిలీ మందుల దర్యాప్తునకు సహకరిస్తున్నాం.. రోగుల భద్రతే మాకు అత్యున్నత ప్రాధాన్యం: ఫైజర్ ఇండియా ప్రకటన అమెరికాతో ఆయుధ కొనుగోలు సంబంధాలు ముమ్మరం ఐరాస పర్యావరణ లక్ష్యాలకు వెనుకబడిన ప్రపంచ దేశాలు శ్రీశైలంలో ముగిసిన గణపతి నవ రాత్రోత్సవాలు సూడాన్ సైన్యాధ్యక్షుడి వీసా నిలిపివేసిన అమెరికా భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7 శాతానికి పెంచిన ఎస్ అండ్ పీ: ఆర్బీఐ నుంచి 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు అవకాశం ప్రపంచ వ్యవస్థ నిర్మాణంలో సెలాక్ కీలక భాగస్వామి: విదేశాంగ మంత్రి జైశంకర్  డిసెంబర్‌లో కెనడా పర్యటనకు ప్రధాని మోదీ: వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం.. కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడి మృతుల కుటుంబాలకు మంత్రి పొన్నం పరామర్శ కుంభకోణం సారంగపాణి ఆలయం: అద్భుతమైన రథాకార నిర్మాణం మరియు దివ్య చరిత్ర రాజమహేంద్రవరంలో 5 కె రెడ్ రన్ మారధాన్

నకిలీ మందుల దర్యాప్తునకు సహకరిస్తున్నాం.. రోగుల భద్రతే మాకు అత్యున్నత ప్రాధాన్యం: ఫైజర్ ఇండియా ప్రకటన

Select Suryaa Now
నకిలీ మందుల దర్యాప్తునకు సహకరిస్తున్నాం.. రోగుల భద్రతే మాకు అత్యున్నత ప్రాధాన్యం: ఫైజర్ ఇండియా ప్రకటన

సూర్య బిజినెస్ డెస్క్కర్ణాటకలో ఇటీవల వెలుగుచూసిన భారీ నకిలీ ఔషధాల నెట్వర్క్ ఉదంతంపై అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇండియా స్పందించిందిరోగుల భద్రత మరియు ఔషధాల నాణ్యతకే తాము అత్యున్నత ప్రాధాన్యతనిస్తామని వివాదానికి సంబంధించి దర్యాప్తు అధికారులకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నామని సంస్థ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. తమ బ్రాండ్ పేరిట చలామణీ అవుతున్న నకిలీ మందుల వ్యవహారం తమ దృష్టికి వచ్చినప్పటి నుంచే అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామనినకిలీలకు అసలైన మందులకు మధ్య తేడాలను గుర్తించడంలో సాంకేతిక వివరాలను అందిస్తున్నట్లు వివరించిందిరోగులు అయోమయానికి గురికాకుండా ఉండేందుకు మార్కెట్ నుంచి ప్రభావిత బ్యాచ్లను వెనక్కి తీసుకునే చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది

 

బెంగళూరు శివార్లలోని బిదాది పరిసరాల్లో డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిర్వహించిన మెరుపు దాడుల్లో సుమారు రూ. 5.05 కోట్ల విలువైన నకిలీ మందులులేబుళ్లుప్రింటింగ్ మెటీరియల్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు లభించే మందులను సేకరించికొత్త వయల్స్లో నింపివాటిపై ఫైజర్ వంటి అంతర్జాతీయ బహుళజాతి కంపెనీల పేర్లతో నకిలీ లేబుళ్లుపనిచేయని క్యూఆర్ కోడ్లను ముద్రించి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.  వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో కర్ణాటక ప్రభుత్వం ఏకంగా 16 ఫార్మా లైసెన్సులను రద్దు చేయడంతో పాటునెలమంగళలోని ఫైజర్ సి&ఎఫ్ డిపో సహా ఎనిమిది సంస్థల లైసెన్సులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. 

 

ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్చేపట్టిన విచారణలో ఉత్పత్తుల మూలాలుల్యాబ్ టెస్టింగ్కు అవసరమైన ప్రమాణాల సమాచారంపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు అధికారులతో నిరంతరం పనిచేస్తున్నామని ఫైజర్ పేర్కొంది. ప్రజారోగ్య రక్షణవైద్య రంగంపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టడమే తమ లక్ష్యమని సంస్థ పునరుద్ఘాటించిందిమరోవైపులైఫ్ సేవింగ్ ఔషధాలను కొనుగోలు చేసే సమయంలో కేవలం అధికారికలైసెన్స్ కలిగిన ఫార్మసీల నుంచే బిల్లులతో తీసుకోవాలనిప్యాకేజింగ్ లేదా క్యూఆర్ కోడ్లలో ఎలాంటి తేడాలు గమనించినా వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని కర్ణాటక ఔషధ నియంత్రణ విభాగం ప్రజలను హెచ్చరించింది