BREAKING
బిగ్ బాస్ హౌస్‌లో తారస్థాయికి నామినేషన్ల రగడ.. సుధీర్‌పై సృష్టి తీవ్ర ఆగ్రహం అమెరికాకు 'నాలుగు రెడ్ లైన్స్' హెచ్చరికలు చేసిన చైనా ఆర్కిటిక్ వివాదానికి తెర తీవ్ర వాయుగుండం.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం డిసెంబర్‌లో ప్రధాని మోదీ కెనడా పర్యటన రాపో 23 మూవీ క్రేజీ అప్‌డేట్.. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో సెకండ్ షెడ్యూల్ పూర్తి స్టాక్ మార్కెట్లలో ఫ్లాట్ ప్రారంభం తెలుగు ప్రేక్షకుల నుంచి ఇంత ప్రేమను ఊహించలేదు: నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ భావోద్వేగం తెల్లకాగితం సినిమా ఇరుముడి స్థాయిలో ఘనవిజయం సాధించాలి: ప్రముఖ రచయిత కోన వెంకట్ ఆకాంక్ష శ్రీశైలంలో 95 టీఎంసీల నీటి నిల్వలు ఆపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది జాతీయ అవార్డు వేదికపై అరుదైన గౌరవం.. కంటతడి పెట్టించిన సింగర్ వైకం విజయలక్ష్మి ప్రయాణం తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతంటే? బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ప్రభావం: విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం, హైఅలర్ట్ జారీ రాజస్థాన్‌లో పెట్రోల్ బంక్‌లో భీభత్సం: ట్రాక్టర్‌తో యువకుడిని చంపే ప్రయత్నం

ఆపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది

Select Suryaa Now
ఆపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది

సూర్య  ఎలిగేడు 

 మండల కేంద్రానికి చెందిన బాసంపల్లి సాగర్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లడంతో 108 సిబ్బంది సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. సాగర్ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన ఆయన తండ్రి భూమయ్య వెంటనే 108కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న సుల్తానాబాద్ 108 సిబ్బంది టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ, పైలట్ గాండ్ల వెంకటేశ్వర్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాగర్‌ను పరీక్షించగా షుగర్ లెవల్స్ పడిపోయినట్లు గుర్తించిన టెక్నీషియన్ రవివర్మ వెంటనే డిక్ట్రోజ్ సెలైన్ ఎక్కించారు. అనంతరం రక్తపోటు కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించి నార్మల్ సెలైన్ ఎక్కించి ప్రథమ చికిత్స అందించారు.సకాలంలో వైద్య సహాయం అందించడంతో సాగర్ పరిస్థితి మెరుగుపడగా, తదుపరి చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. తక్షణమే స్పందించి సాగర్ ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది టెక్నీషియన్ ఇరుగురాల రవివర్మ, పైలట్ గాండ్ల వెంకటేశ్వర్లును కుటుంబ సభ్యులు అభినందించారు