BREAKING
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ప్రభావం: విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం, హైఅలర్ట్ జారీ రాజస్థాన్‌లో పెట్రోల్ బంక్‌లో భీభత్సం: ట్రాక్టర్‌తో యువకుడిని చంపే ప్రయత్నం ఎన్‌టీఆర్‌ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు నేటి రాశి ఫలాలు: సెప్టెంబర్ 23, 2026 - 12 రాశుల దినఫలాలు మరియు పరిహారాలు నేటి పంచాంగం: 23 సెప్టెంబర్ 2026, బుధవారం - తిథి, నక్షత్రం మరియు శుభ ముహూర్తాలు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో 'ది పారడైజ్' ప్రీమియర్: తెలంగాణ ప్రభుత్వానికి హీరో నాని విజ్ఞప్తి టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసినా సడన్‌గా కనిపించకుండాపోయిన బ్యూటీ.. ఎవరితను? స్టార్ హీరోయిన్ చెల్లెలుగా ఎంట్రీ.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సినిమాలకు దూరమైన నటి నిషా అగర్వాల్ పుష్ప సినిమాలో ఆ ఫేమస్ రోల్ మొదట నాకే వచ్చింది: టాలీవుడ్ నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్ విశాఖలో ఘోరం - యువకుడిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చిరుతపులి చర్మాల వేట కేసు: వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ సీఈఓకు అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు 2027 ఆర్థిక సంవత్సరంలో భారత్ సరికొత్త రికార్డు: 8 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యం జోడింపునకు సన్నాహాలు 2019 శ్రీలంక ఈస్టర్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు: 15 మంది నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు నేరటోనిగూడెంలో శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీలో కలకలం రేపిన ర్యాగింగ్ ఉదంతం

రాజస్థాన్‌లో పెట్రోల్ బంక్‌లో భీభత్సం: ట్రాక్టర్‌తో యువకుడిని చంపే ప్రయత్నం

Select Suryaa Now
రాజస్థాన్‌లో పెట్రోల్ బంక్‌లో భీభత్సం: ట్రాక్టర్‌తో యువకుడిని చంపే ప్రయత్నం

సూర్య క్రైమ్ డెస్క్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని పింగున్ గ్రామంలో అత్యంత షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సురేష్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ కొట్టించుకునేందుకు స్థానిక పెట్రోల్ బంక్‌కు వెళ్లగా, అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. అప్పటికే అక్కడ ట్రాక్టర్‌తో ఉన్న మరో వ్యక్తి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సురేష్‌ను టార్గెట్ చేస్తూ ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చేందుకు దారుణమైన ప్రయత్నం చేశాడు.

నిందితుడు ఒకటికి రెండు సార్లు ట్రాక్టర్‌తో సురేష్‌ను వేగంగా ఢీకొట్టేందుకు ప్రయత్నించగా, ప్రాణభయంతో సురేష్ అక్కడి నుంచి చాకచక్యంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి, సురేష్‌ వదిలివెళ్లిన ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్‌తో తొక్కించి పూర్తిగా ధ్వంసం చేశాడు. అనంతరం తన ట్రాక్టర్‌తో అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు.

ఈ మొత్తం భయానక ఘటన పెట్రోల్ బంక్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ फुటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని షైతాన్‌గా గుర్తించిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని తదుపరి చట్టపరమైన చర్యలు నిమిత్తం అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బంక్‌లో నడిరోడ్డుపై జరిగిన ఈ హింసాత్మక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.