ఎన్‌టీఆర్ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు
విజయవాడ, సెప్టెంబర్ 23, మేజర్ న్యూస్ : తుఫాను ‘అర్నబ్’ ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్‌టీఆర్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఈ ప్రకటన విడుదల చేశారు.
పాఠశాలలకు రాకపోకల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన సెలవును పరిహార సెలవుగా పరిగణించనున్నట్లు, ఇందుకు సంబంధించిన తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి వెల్లడించారు.