శ్రీశైలంలో 95 టీఎంసీల నీటి నిల్వలు
శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా 24 గంటల వ్యవధిలో 26,033 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పోతిరెడ్డిపాడుకు 4 వేల క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ఎస్కు 3,450 క్యూసెక్కులు, మహాత్మా గాంధీ కల్వకుర్తికి 572 క్యూసెక్కులు, వెలుగొండకు 1,260 క్యూసెక్కులు, తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రానికి 16,640 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి ఆవిరి రూపంలో 111 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. బుధవారం ఉదయం 6 గంటలకు డ్యామ్ నీటిమట్టం 856.40 అడుగులు, నీటి నిల్వ 95.5900 టీఎంసీలుగా నమోదైంది.