BREAKING
దౌత్య మార్గంలో రష్యా-ఉక్రెయిన్ వార్ ఐరాసలో ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తీవ్ర వ్యాఖ్యలు అభివృద్ధి సమీక్ష.. ఆధ్యాత్మిక వేడుకలు.. నేడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటన ఫ్లాష్ ఫ్లాష్ కెరీర్ ఆరంభంలో ఆ సినిమా చేయడం పెద్ద తప్పు: ప్రముఖ నటి సదా ఆసక్తికర వ్యాఖ్యలు వరల్డ్ కప్ సమయానికి నూతన ప్రభుత్వం...మొరాకో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రారంభమైన పోలింగ్ కనుమరుగవుతున్న పవిత్ర పచ్చబొట్టు కళ బిగ్ బాస్ హౌస్‌లో తారస్థాయికి నామినేషన్ల రగడ.. సుధీర్‌పై సృష్టి తీవ్ర ఆగ్రహం అమెరికాకు 'నాలుగు రెడ్ లైన్స్' హెచ్చరికలు చేసిన చైనా ఆర్కిటిక్ వివాదానికి తెర తీవ్ర వాయుగుండం.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం డిసెంబర్‌లో ప్రధాని మోదీ కెనడా పర్యటన రాపో 23 మూవీ క్రేజీ అప్‌డేట్.. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో సెకండ్ షెడ్యూల్ పూర్తి స్టాక్ మార్కెట్లలో ఫ్లాట్ ప్రారంభం తెలుగు ప్రేక్షకుల నుంచి ఇంత ప్రేమను ఊహించలేదు: నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ భావోద్వేగం

తీవ్ర వాయుగుండం.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

Select Suryaa Now
తీవ్ర వాయుగుండం.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

 

విశాఖపట్నం, సెప్టెంబర్ 23, మేజర్ న్యూస్: పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. వాయుగుండం పరిస్థితులను హోంమంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయిలోని అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈదురుగాలుల నేపథ్యంలో జాగ్రత్తలు

ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల సమీపంలో ప్రజలు నిలబడరాదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సూచించే భద్రతా చర్యలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.