డీజే లకు అనుమతి లేదు
డీజే లకు అనుమతి లేదు
-ఎస్సై టీవీఆర్ సూరి
మంగపేట, సెప్టెంబర్, సూర్య(మేజర్ న్యూస్):
వినాయక నిమజ్జన శోభాయాత్రలో డీజే లకు అనుమతి లేదని ఎస్సై టీవీఆర్ సూరి గణేశ్ ఉత్సవ కమిటీలకు సూచించారు. నేడు జరగనున్న నిమజ్జనానికి మంగపేట మండలంలోని గోదావరిలో అనుమతి లేదని, ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వంతెన వద్ద నిమజ్జనం చేసుకోవాలని తెలిపారు. వాహనాలపై మద్యం మత్తులో ఉన్నవారిని అనుమతించవద్దని, పరిమితికి మించి జనాన్ని ఎక్కించవద్దని, రెచ్చగొట్టే నినాదాలు, మత స్థలాల వద్ద ఊరేగింపు ఆపడం చేయవద్దని హెచ్చరించారు. రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయవద్దని, కరెంట్ తీగల పట్ల అజాగ్రత్త వద్దని సూచించారు. డీజే సౌండ్, మద్యం సేవించి నృత్యాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని, బాధ్యత కమిటీదేనని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ తరపున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.