పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.నగర బాట కార్యక్రమంలో కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్
మోడంపల్లిలో విస్తృత పర్యటన.
70 సంవత్సరాల మహబున్ని సూచనలు పాటింనున్న కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : ప్రొద్దుటూరు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ నగర బాట పట్టారు. బుధవారం స్థానిక ప్రజలను పలకరించి సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపల్ అధికారుల బృందంతో వార్డులలో పర్యటించిన కమీషనర్ ప్రజలనుంచి అందిన సమస్యలను నమోదు చేసారు. కార్యక్రమంలో భాగంగా మోడంపల్లి ప్రాంతంలో కమీషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్, వార్డు సచివాలయం అధికారులు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లు తదితర మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసారు. డ్రైన్స్ మీద అక్రమ కట్టడాలు ఉండడం వలన మురుగు నీరు పోక రోడ్డు మీదకు పోర్లడాన్ని గమనించిన కమీషనర్ టౌన్ ప్లానింగ్ సిబ్బంకు క్లాస్ తీసుకున్నారు. పనిలో పనిగా స్థానిక ప్రజలకు కూడా అవగాహన కల్పించి డ్రైన్స్ మీద ఉన్న అక్రమ కట్టడాలను తొలగించమని వారం రోజులు సమయం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వ కోట్లాది రూపాయిలు నిధులు విడుదల చేసిందని అధికారులు కూడా తమ శాఖాపరిధిలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి విషయాలు ప్రజలకు తెలిపి 'పబ్లిక్ పాజిటివ్ పెర్సెప్షన్' పెంచాలని తెలిపారు. అధికారులు తమ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. ప్రజలకు అందాల్సిన మున్సిపల్ సేవల్లో లోపాలు తలెత్తితే సంబంధిత అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సందర్బంగా 70 సంవత్సరాల మహబున్ని పారిశుధ్య నిర్వహణలో కమీషనర్ కు పలు సూచనలు చేయగా తప్పనిసరిగా పాటిస్తానని కమీషనర్ అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడైనా చెత్త పేరుకుపోయినా, పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోయినా చర్యలు తప్పవని అలాగే ప్రతిరోజూ శానిటేషన్ పనులను పర్యవేక్షించాలని శానిటేషన్ సూపర్ వైజర్ నూర్ భాషను ఆదేశించారు. తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతుందని మోడంపల్లి స్థానికులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఏఈ సురేంద్ర వారి వాటర్ వర్క్స్ సిబ్బందిని కమీషనర్ అభినందించారు. నగర బాట కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజా సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కారానికి ఉపయోగపడే కమీషనర్ నగరబాట కార్యక్రమం కొనసాగుతుందని కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో డిఈఈ రాజేష్, యశోద, ఏఈలు సురేంద్ర, దస్తగిరి, శానిటేషన్ సూపర్ వైజర్ నూరుబాషా, రెవిన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ బాబు, సచివాలయం సిబ్బంది, నాయకులు సూర్యనారాయణ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.