BREAKING
మడకలవారిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం మడకలవారిపల్లె సమీపంలో రాత్రి బైపాస్ హైవేపై లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న భాస్కర్ (50), రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పో బలప్రయోగం లేని సంభాషణలకు సిద్ధం: యుద్ధ పరిస్థితులపై ఇరాన్ కీలక ప్రకటన ఆస్ట్రేలియా మెడికేర్ పోర్టల్‌లోకి చొరబడిన ఓపెన్ఏఐ ఏజెంట్: ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడి కాకినాడ కలెక్టరేట్లో కుప్పకూలిన భారీ వృక్షం! వివిధ పుష్పాలతో విశేష అలంకరణలో సిద్ధి గణపతి వరద రాకముందే.. మన్యంలో కాపలా! సీనియర్ సిటిజన్లకు నామినేషన్ల ఆహ్వానం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం – 2026 'మై భారత్' ద్వారా వికసిత్ భారత్ 2047 లక్ష్యం సులభ్ కాంప్లెక్స్ లను తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్. తీరంలో అలజడి..మన్యంలో వాగుల ఉదృతి ఆహా.. అనిపిస్తున్న పాలకొండ జలపాతాలు మంగపేట నూతన డీటీగా షాపూర్ రాజేందర్ కోనసీమ జిల్లాలో వినాయక ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత: మరణాయుధాలతో పరస్పర దాడి.. నలుగురికి తీవ్ర గాయాలు రూ.100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ షీ జిన్‌పింగ్‌తో భేటీలో మతస్వేచ్ఛ, అమెరికన్ల నిర్బంధంపై నిలదీయండి: ట్రంప్‌కు యూఎస్ సెనేటర్ టెడ్ బడ్ విజ్ఞప్తి

డిసెంబరులోగా బంగారు కుటుంబాలకు భరోసా: 2028 నాటికి కార్బన్ న్యూట్రల్ కుప్పంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు

Select Suryaa Now
డిసెంబరులోగా బంగారు కుటుంబాలకు భరోసా: 2028 నాటికి కార్బన్ న్యూట్రల్ కుప్పంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: పేదరికాన్ని కేవలం సంక్షేమ పథకాలతో రూపుమాపడమే కాకుండా, పేద కుటుంబాలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో గుర్తించిన 8,904 బంగారు కుటుంబాలను 2026 డిసెంబరులోగా ఆర్థికంగా ఆదుకునేలా చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు. పేద కుటుంబాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావడానికి మార్గదర్శులు పనిచేయాలని, ఆయా కుటుంబాల సామర్థ్యాలకు అనుగుణంగా చేయూత అందించాలని సూచించారు. కుప్పం పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా మాట్లాడారు.

తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తదితర సూపర్ సిక్స్ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు, కుటుంబాలకు కలుగుతున్న ఆర్థిక వెసులుబాటు, సాధికారతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేద కుటుంబానికీ అండగా నిలవాలన్న లక్ష్యంతోనే సూపర్ సిక్స్ పథకాలను ప్రారంభించామని తెలిపారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సంజీవని ఆరోగ్య కార్యక్రమం దేశానికే మోడల్‌గా మారుతోందని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని చెప్పారు. డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

కుప్పాన్ని 2028 నాటికి కార్బన్ న్యూట్రల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. ఇంధనం, నీరు, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యర్థాలను సంపదగా మార్చి నెట్రో కుప్పం దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ప్రతి ఇంటిపైనా సౌర విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటును ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కుప్పంలో 75-80 శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.