సులభ్ కాంప్లెక్స్ లను తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్.
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్ లను గురువారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ పరిశీలించారు. యాత్రికుల ఫీడ్ బ్యాక్ నమోదు చేయాలని వర్షాలు కారణంగా లో లెవెల్ ప్రాంతాలలో నిలిచిన నీరు, డ్రైన్స్ క్లియర్ చేసి తరలింపు చేస్తామన్నారు. పట్టణం లోని పలు దుకాణాలు తనిఖీలు చేసి ప్లాస్టిక్ మీద, పారిశుధ్య నిర్వహణ మీద యజమానులకు పలు సూచనలు చేశారు. దోమలు పెరగడానికి ఆస్కారం ఉన్నస్థాయిలో బస్సు స్టాండ్ ప్రాంతంలో వేలాది టైర్స్ లో నిల్వ ఉన్న వర్షపు నీటిని గుర్తించిన కమీషనర్ తక్షణమే నీటిని తొలగించి మాలతీయన్ స్ప్రేయింగ్ చేయమని శానిటేషన్ సూపర్ వైజర్ నూర్ బాషకు ఆదేశించారు. దోమలు నివారణలో భాగంగా రానున్న రెండు రోజులు నగరంలో ఫాగ్గింగ్ చేయించడానికి చర్యలు తీసుకుంటామని నిల్వ ఉన్న మాంసం, చేపలు, తిండి విక్రయలపై నిఘా ఉంచాలని పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరాకు మున్సిపాలిటీ ద్వారా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వర్షాలు కారణంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సహాయం, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని నగరంలో అధికారుల బృందంతో పలు ప్రాంతాలు పర్యటంచి ప్రజలతో మాటమంతి తో కలియతిరిగారు.