BREAKING
యాలాల శివసాగర్ ప్రాజెక్ట్‌ నుంచి వృథాగా పోతున్న నీరు వుషులో రజతం సాధించిన నౌరెమ్ రోషిబినా దేవి గ్రూప్ టాప్‌గా సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత పురుషుల కబడ్డీ జట్టు! పొంగుతున్న వాగు... తీరని వంతెన కష్టం! చైనా అనుసంధాన వాహనాలపై నిషేధానికి అమెరికా ముమ్మర చర్యలు: కాంగ్రెస్ బిల్లుకు పెరుగుతున్న మద్దతు నేపాల్‌లో వీసా నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం: 88 మంది చైనా పౌరుల బహిష్కరణ.. మరో 329 మందిపై విచారణ కెన్యాలో టాటా కెమికల్స్‌కు ఎదురుదెబ్బ: మగాడీలో కార్యకలాపాలు నిలిపివేసి వెళ్లిపోవాలన్న అధ్యక్షుడు రూటో గణేష్ నిమజ్జన వేడుకల్లో విద్యుత్ షాక్ తో యువకుని మృతి క్రిస్పర్ తరహా విప్లవాత్మక ఎంజైమ్ వ్యవస్థను కనుగొన్న క్లాడ్ ఏఐ మోడల్: ఆంత్రోపిక్ సంచలన ప్రకటన మడకలవారిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం మడకలవారిపల్లె సమీపంలో రాత్రి బైపాస్ హైవేపై లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న భాస్కర్ (50), రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పో బలప్రయోగం లేని సంభాషణలకు సిద్ధం: యుద్ధ పరిస్థితులపై ఇరాన్ కీలక ప్రకటన ఆస్ట్రేలియా మెడికేర్ పోర్టల్‌లోకి చొరబడిన ఓపెన్ఏఐ ఏజెంట్: ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెల్లడి కాకినాడ కలెక్టరేట్లో కుప్పకూలిన భారీ వృక్షం! వివిధ పుష్పాలతో విశేష అలంకరణలో సిద్ధి గణపతి వరద రాకముందే.. మన్యంలో కాపలా!

వరద రాకముందే.. మన్యంలో కాపలా!

Select Suryaa Now
వరద రాకముందే.. మన్యంలో కాపలా!

*వరద రాకముందే.. మన్యంలో కాపలా!*

*శబరి–గోదావరి సంగమం నుంచి అన్నవరం వంతెన వరకు పీ.ఓ. క్షేత్రపర్యటన*

*మండలానికో డిప్యూటీ కలెక్టర్.. పంచాయతీకో ప్రత్యేక అధికారి*

*గర్భిణులు, చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి*

*పునరావాస కేంద్రాలు, మందులు, ఆహారం ముందుగానే సిద్ధం*

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో

(వి.ఆర్.పురం)

*ఎడతెరిపి లేని వానలు.. ఉద్ధృతమవుతున్న వాగులు.. శబరి–గోదావరి నదుల్లో పెరుగుతున్న ప్రవాహం. వరద ముప్పు పొంచి ఉన్న వేళ చింతూరు ఐటీడీఏ యంత్రాంగం ముందుగానే రంగంలోకి దిగింది. ప్రాజెక్టు అధికారి శుభం నోఖ్వాల్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి వంతెనలు, నదుల సంగమ ప్రాంతాలను పరిశీలించారు. వీఆర్‌పురం నుంచి కునవరం వరకు తిరుగుతూ పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రజల ప్రాణభద్రతే మొదటి ప్రాధాన్యమని, పరిస్థితి తీవ్రమయ్యేలోపే అవసరమైన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.*

*అన్నవరం వంతెనపై ఆరా*

*వీఆర్‌పురం తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో సమీక్షించిన అనంతరం పీ.ఓ. అన్నవరం వంతెన వద్దకు వెళ్లారు. నీటి ప్రవాహం, రహదారి పరిస్థితి, ప్రజల రాకపోకలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రవాహం పెరిగితే రాకపోకలను నియంత్రించేందుకు రెవెన్యూ, పోలీసు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.*

*అక్కడి నుంచి కునవరం వంతెన వద్ద శబరి–గోదావరి సంగమ ప్రాంతానికి చేరుకుని నీటిమట్టం, వరద ప్రవాహంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీరు పెరిగితే ముందుగా ప్రభావితమయ్యే ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.*

*గ్రామస్థాయి వరకు నిఘా*

*ప్రతి మండలానికి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను, ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిని నియమించారు. రెవెన్యూ, వైద్య, పోలీసు, పంచాయతీరాజ్ శాఖలతో పాటు ఆశా కార్యకర్తలను అప్రమత్తం చేశారు. డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి రహదారి అంతరాయాలు, వరద ముప్పు, ప్రజల అత్యవసర అవసరాలపై సమాచారం అందిన వెంటనే స్పందించాలని ఆదేశించారు.*

*గర్భిణులపై ప్రత్యేక దృష్టి*

*వరదల్లో వైద్యసేవలకు అంతరాయం లేకుండా ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. గర్భిణులను ముందుగానే గుర్తించి అవసరమైతే వరద తీవ్రత పెరగకముందే సురక్షిత ప్రాంతాలకు లేదా ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితిని ఆశా కార్యకర్తలు నిరంతరం గమనించాలని ఆదేశించారు.*

*తరలింపునకూ ముందస్తు ఏర్పాట్లు*

*పరిస్థితి తీవ్రమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వాహనాలు, పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, వైద్య, పారిశుధ్య సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని పీ.ఓ. స్పష్టం చేశారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. పొంగుతున్న నదులు, వాగులను దాటే ప్రయత్నం చేయకుండా అధికారుల హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని శుభం నోఖ్వాల్ సూచించారు.*